రాజు తలుచుకుంటే కాసులకు కరువా? అన్న సామెత గుర్తుంది కదా.. ఈ సామెత అంబానీ, అదానీ లాంటి కుటుంబాలకు కాకుండా ఎవరికి వర్తిస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కుబేరుడి భార్య. ఇక ఆ వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు నీతా అంబానీ (Nita Ambani) మరోసారి లగ్జరీకి కొత్త ప్రమాణంగా నిలిచారు. ₹12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ కారును తన ప్రైవేట్ కలెక్షన్‌లో చేర్చుకున్నారు. ఇది ఆమె రెండో రోల్స్ రాయిస్. 2023లో తన భర్త ముకేశ్ అంబానీ ఇచ్చిన కుల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ తర్వాత వచ్చిన ప్రత్యేక కానుకగా చెప్పవచ్చు.
వెల్వెట్ ఆర్కిడ్ నుంచి రోస్ క్వార్ట్జ్ వరకు..
నీతా అంబానీ కొత్త ఫాంటమ్ ప్రత్యేకత దాని రంగు. ఈ కార్‌కి ఉన్న రెండు టోన్ ఫినిష్ వెల్వెట్ ఆర్కిడ్ (గాఢ గులాబీ), రోస్ క్వార్ట్జ్ (సున్నితమైన పింక్) కాంబో. చూసే వారిని మంత్రముగ్ధులను చేస్తోంది. దాని ముందు భాగంలో ఉన్న గోల్డ్ ప్లేటెడ్ ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ’ సింబల్ ఈ కారుకు రాజసంగా సొగసును అందిస్తుంది. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు. లగ్జరీని కళాత్మకంగా ప్రదర్శించే ఒక చలన విగ్రహం లాంటిదని కూడా చెప్పవచ్చు.
ఫాంటమ్ అంతర్గత రూపకల్పనలోనూ నీతా అంబానీ వ్యక్తిగత శైలి ప్రతిబింబిస్తోంది. సీట్ల హెడ్‌రెస్టులపై ‘NMA’ (Nita Mukesh Ambani) అనే మొదటి అక్షరాలు హస్తకళా ఎంబ్రాయిడరీగా అద్దబడ్డాయి. ప్రత్యేకంగా రూపొందించిన డిన్నర్ ప్లేట్ వీల్స్, మృదువైన లెదర్ సీట్లు, గోల్డ్ ట్రిమ్స్ ఈ కారును ప్రత్యేకంగా నిలబెట్టాయి. ప్రతీ భాగం ఒక కళాఖండం, ప్రతి కుట్టు ఒక అద్భుతం అన్నట్లు ఉంది.
6.75 లీటర్ల ట్విన్ టర్బో V12 ఇంజిన్‌తో నడిచే ఈ కారుకు 571 బిహెచ్‌పి పవర్ ఉంది. కానీ, రోల్స్ రాయిస్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది వేగం కాదు విలాసం. ఫాంటమ్‌లో కూర్చుని ప్రయాణించడం అనేది కేవలం డ్రైవ్ కాదు. ఒక ప్రయాణ అనుభవం, ఒక రాజసమైన ధ్యానం.
ఫ్యాషన్, ఆటో మొబైల్, లగ్జరీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.ఇది కేవలం ఒక కారు కాదు.. నీతా అంబానీ గ్రేస్, గ్లోరి, గ్లామర్ కలయికకు ఒక ప్రతీకగా నిలిచింది. 2025లో అత్యంత చర్చనీయాంశమైన లగ్జరీ కార్‌గా ఫాంటమ్ VIII స్థానాన్ని బలపరుచుకుంది.
నీతా అంబానీకి విలాసం అంటే కేవలం డబ్బు కాదు.. అది ఒక భావ వ్యక్తీకరణ. ఆమె స్టయిల్ అంటే అధిక ఖర్చును కాకుండా, అంతర్గతంగా ఉన్న ఒక అభిరుచి, ప్రత్యేకమైన ప్రతిభ. ఈ పింక్ ఫాంటమ్ కూడా అదే చెబుతోంది. లగ్జరీ అనేది చూపించడానికి కాదు.. ప్రతిబింబించడానికి అని చెప్తుంది. వెల్వెట్ ఆర్కిడ్ లోని మృదుత్వం, రోస్ క్వార్ట్జ్ లోని సౌందర్యం
నీతా అంబానీ వ్యక్తిత్వం లాగే. ఈ కారు కూడా శాంతమైన శక్తికి ప్రతీక.


















