ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Nimisha Priya case: బ్లడ్ మనీ మాత్రమే నిమిషను కాపాడేందుకు ఉన్న చిట్టచివరి అవకాశమా?

Nimisha Priya case: బ్లడ్ మనీ మాత్రమే నిమిషను కాపాడేందుకు ఉన్న చిట్టచివరి అవకాశమా?
ADVERTISEMENT

జులై 16న యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతితక్కువని కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ప్రియ ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అయితే, బ్లడ్ మనీ సెటిల్‌మెంట్ మాత్రమే నిమిషను కాపాడగలిగే ఏకైక మార్గం అని ఏజీఐ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి దౌత్యపరమైన చర్చల ద్వారా రక్షించేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో జులై 10వ తేదీన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తన వాదనలు వినిపించారు. జులై 16న కేరళ నర్సు మరణశిక్షను ఆపేందుకు లేదా వాయిదా వేయించేందుకు భారత ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న అవకాశాలు అతి తక్కువని ఆమె తెలిపారు. భారత్‌-యెమెన్‌ల మధ్య దౌత్యపరంగా సత్సంబంధాలు లేకపోవడమూ ఒక కారణమని అన్నారు. యెమెన్ సున్నితత్వాన్ని దృష్టిపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయగలిగిందేమి లేదని అన్నారు. ఇక బ్లడ్ మనీ మాత్రమే నిమిషను కాపాడేందుకు ఉన్న చిట్టచివరి అవకాశం అని.. అది కూడా ప్రైవేటు ఒప్పందం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

AGI, నిమిష తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. కేసు స్థితి గురించి ఇరువర్గాల తదుపరి విచారణలో కోర్టుకు తెలియజేయవచ్చు అని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ లోగా ఆమె ప్రాణాలు కోల్పోతే అది అత్యంత విచారకరమని అన్నారు. అయితే, ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిమిషను ప్రధాని కాపాడాలని కోరుతూ నిన్న విదేశాంగశాఖ మంత్రి జై జైశంకర్‌కు లేఖ రాశారు.

కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌లో ఉద్యోగంలో చేరింది. 2011లో ఆమెకు థామస్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి క్లినిక్ తెరవాలనుకున్నారు. యెమెన్‌లో ఇతర దేశస్థులు సొంతంగా వ్యాపారం చేయడం కుదరదు. అందుకని స్థానికుడైన తలాల్‌ అదిబ్‌ మెహదితో కలిసి అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను మొదలుపెట్టారు. అయితే, 2014లో నిమిష భర్త, కూతురు ఆర్థిక కారణాల కారణంగా ఇండియాకు తిరిగొచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుని ఇంటికి తిరిగిరాలేకపోయింది. ఆ తర్వాత నుంచి మెహది ఆమె పాస్ పోర్టు, డబ్బు లాక్కుని చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో 2016లో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఫలితం దక్కకపోవడంతో.. 2017లో ఓ రోజున తన పాస్ పోర్టు తీసుకునేందుకు మెహదీకి మత్తుమందు ఇచ్చింది. దురదృష్టవశాత్తూ డోసు ఎక్కువై మెహదీ చనిపోవడంతో అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసి సౌదీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడింది.

అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కున్న కేరళ నర్సు నిమిషను కాపాడేందుకు బ్లడ్ మనీ మాత్రమే చివరి అవకాశం. అంటే, మృతుడి కుటుంబం నిమిష కుటుంబం ఇవ్వజూపుతున్న రూ.8.6 కోట్ల మొత్తాన్ని పరిహారంగా తీసుకుని క్షమించేందుకు అంగీకరించాలి. యెమెన్ చట్టాల ప్రకారం అలా ఒప్పుకుంటే నిందితుడిని వదిలేసే అవకాశం ఉంది.

Tags: #National #Kerala #Yemen #Supreme Court #Latest News #Telugu News #International #Nimisha Priya case Nimisha Priya case Supreme CourtNimisha priya caseSSupreme court of india
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP Govt: ఏపీలో వారికి గుడ్ న్యూస్

Next Post

Pawan Kalyan: పవర్‌ ఫుల్‌గా వీరమల్లు 2

Related Posts

Telangana
Big Story

Telangana:తెలంగాణ లోక్‌సభ సీట్ల పెంపు, కుల గణాంకాలు, బీసీ రాజకీయాలు, ప్రాతినిధ్య మార్పులు

Delimitation2026
Big Story

Delimitation2026:రాజ్యాంగ బాధ్యతా? రాజకీయ వ్యూహమా? దక్షిణాది ప్రాతినిధ్యంపై ప్రభావం పూర్తి విశ్లేషణ

IPL2026
Big Story

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp
Andhra Pradesh

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029
Big Story

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?
Big Story

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?

Next Post
Pawan Kalyan: పవర్‌ ఫుల్‌గా వీరమల్లు 2

Pawan Kalyan: పవర్‌ ఫుల్‌గా వీరమల్లు 2

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana

Telangana:తెలంగాణ లోక్‌సభ సీట్ల పెంపు, కుల గణాంకాలు, బీసీ రాజకీయాలు, ప్రాతినిధ్య మార్పులు

Delimitation2026

Delimitation2026:రాజ్యాంగ బాధ్యతా? రాజకీయ వ్యూహమా? దక్షిణాది ప్రాతినిధ్యంపై ప్రభావం పూర్తి విశ్లేషణ

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info