హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కన్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆమె నటిగా సక్సెస్ కాలేకపోయారు. కానీ నిర్మాతగా దూసుకెళ్తున్నారు. షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లతో పాటు గతేడాది ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం కలెక్షన్స్‌తో పాటు గద్దర్ అవార్డ్‌ను కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మరిన్ని సినిమాలు తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు నిహారిక కొణిదెల. అయితే ఆమె జీవితాన్ని విడాకుల అంశం కీలక మలుపు తిప్పింది. దాని ప్రభావంతో జీవితాన్ని అర్ధం చేసుకోవడం ప్రారంభించారు నిహారిక.
మెగాస్టార్ చిరంజీవి వేసిన బలమైన పునాదులపై తన సినీ ప్రస్థానం ప్రారంభించారు ఆయన రెండో సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. తొలుత బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకున్న నిహారిక .. పలు షోలకు హోస్ట్‌గా, న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ పట్టుదలతో సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలో నటించారు నిహారిక. ఇవి కూడా నిరాశపరచడంతో కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ ప్రకటించారు మెగా డాటర్.
ఈ గ్యాప్‌లోనే సడెన్‌గా ఓ కుర్రాడిని హగ్ చేసుకుని ముఖం చూపించకుండా త్వరలో ఇతనితో ఏడాడుగులు నడవబోతున్నట్లుగా బాంబు పేల్చారు. అతనే చైతన్య జొన్నలగడ్డ.. వ్యాపారవేత్తగా రాణిస్తున్న చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతలోనే చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి కాపురం సజావుగానే సాగగా.. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ దశలో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన నిహారిక ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా మారి ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు నిహారిక. గతేడాది కమిటీ కుర్రోళ్లు సినిమాతోనూ సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు నిహారిక. దీనికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో మైథాలజీ, ప్రభాస్‌తో కామెడీ, అల్లు అర్జున్‌తో ఓ లవ్‌స్టోరీ చేయాలని ఉందని ఇటీవల తన మనసులోని మాటను చెప్పారు మెగా డాటర్.
ఇదిలాఉండగా.. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ తాను విడాకుల తర్వాత కుటుంబంతో కలిసి ఉండటం లేదని సెపరేట్‌గా ఉంటున్నట్లు బాంబు పేల్చింది. అన్నయ్యకు కొడుకు పుట్టడంతో తనకు అత్తగా ప్రమోషన్ వచ్చిందని.. బాబును ఎత్తుకునే ఉండటంతో నాకు ఇప్పుడు ఇంట్లో ఎవరూ పనులు చెప్పడం లేదని నిహారిక నవ్వుతూ అన్నారు. వీడు పెద్దయ్యాక స్టార్ అయితే ఖచ్చితంగా నా బ్యానర్‌లో సినిమా చేస్తానని తెలిపారు. పెదనాన్న, నాన్న, బాబాయ్, అన్నయ్యలకు నా బలమని.. ఇంటికి దూరంగా ఉంటున్నప్పటికీ, రెండ్రోజులకు ఓసారైనా అందరినీ కలుస్తానని నిహారిక చెప్పింది. హీరోయిన్‌గా ఇంత వరకు సంతృప్తి చెందలేదని, కానీ సరైనా సినిమా వస్తే నటించాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించింది మెగా డాటర్. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.