రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో హీరోయిన్‌గా నేహా శర్మ పరిచయం అయిన విషయం తెల్సిందే. మొదటి సినిమాలో నేహా శర్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. నేహా శర్మ కనబర్చిన యాక్టింగ్‌తో పాటు, ఆమె డైలాగ్ డెలివరీ అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి భలే పట్టుకు వచ్చాడే ఈమెను అంటూ అంతా ప్రశంసించారు. చిరుత సినిమాలోని పొగరుబోతు హీరోయిన్ పాత్రకు నేహా శర్మ నూటికి నూరు శాతం న్యాయం చేసింది అనడంలో సందేహం లేదు. అందుకే ఆమెకు టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కుతాయని అంతా భావించారు. కానీ అదృష్టం కలిసి రాలేదు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగడంలో ఆ సినిమా కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నేహా శర్మ తెలుగులో సినిమాలు చేసి చాలా కాలం అయినా కూడా ఇప్పటికీ ఈమెను తెలుగు హీరోయిన్‌గానే ప్రేక్షకులు గుర్తిస్తారు. అందుకు ఈమె పోషించిన పాత్రలు, చేసిన సినిమాలు కారణం అనడంలో సందేహం లేదు. హీరోయిన్గా తెలుగులో ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువే. చిరుత వంటి సూపర్ హిట్ తర్వాత వెంటనే ఈమె సినిమాలు చేయలేదు. కారణం ఏంటి అనేది తెలియదు కానీ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కుర్రాడు సినిమాతో ఈమె వచ్చింది. కుర్రాడు సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచింది. దాంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు రావడమే గగనం అయింది. అయితే ఆ సమయంలో హిందీలో ఈమె సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకున్న కారణంగా వరుసగా అక్కడే సినిమా ఆఫర్లు వచ్చాయి.
అప్పుడప్పుడు తెలుగులో కనిపిస్తున్నప్పటికీ ఈమె ఎక్కువగా నార్త్ ఇండియాకు పరిమితం అయింది. నార్త్‌లో సినిమాలు ఎక్కువగా చేస్తున్న ఈ అమ్మడు తెలుగులోనూ అప్పడుప్పడు కనిపిస్తూ వస్తుంది. సినిమాలతో పాటు ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈమె షేర్ చేసే అందమైన ఫోటోలు, వీడియోల కారణంగా తెలుగు లో స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమెకు తెలుగులో మరిన్ని సినిమా ఆఫర్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నేహా శర్మ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కన్నుల విందు చేసింది. హాలీడే వెకేషన్‌కి వెళ్లిన ఈ అమ్మడు తన రెగ్యులర్ డే కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఫుడ్ తో పాటు అన్ని విషయాలను ఆమె షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఒక సెల్ఫీని ఈమె షేర్ చేసింది. టాప్ యాంగిల్‌లో ఈమె ఆ సెల్ఫీని తీసుకుని క్లీ వేజ్ షో తో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ అమ్మడి ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతూ ఉంటాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు మంచి కెమెరా లుక్ ఈ అమ్మడి సొంతం అని మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం అయ్యింది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది తెలుగులో నేహా కు రావాల్సిన గుర్తింపు రానందుకు బాధగా ఉందనే కామెంట్స్ చేస్తున్నారు.
#NehaSharma on a selfie spree !! @news7telug2024 pic.twitter.com/f5NjWizU47
— news7telugu (@news7telug2024) August 17, 2025