లేడీ సూపర్ స్టార్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి అంతకు మించి సమయం కేటాయిస్తూ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు బాబులకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్. శివన్, ఉలాగ్ ధైవాగ్ ఎన్. శివన్ అని పేరు పెట్టింది. పిల్లల ఫేస్‌లను మొదట రివీల్ చేయని నయనతార దంపతులు ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా వారి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉంటారు, ఇద్దరు బుడి బుడి అడుగులు వేస్తూ నడుస్తున్న ఫోటోలు, వీడియోలను నయనతార గతంలో షేర్ చేసిన విషయం తెల్సిందే.
తాజాగా నయనతార ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అందమైన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది. నయనతార గతంలో మాదిరిగానే స్టైలిష్ లుక్‌లో కనిపిస్తు ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భర్త విఘ్నేష్ శివన్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను మాత్రమే కాకుండా ఇద్దరు కొడుకులతో ఉన్న ఫోటోలను కూడా నయనతార షేర్ చేసింది. ప్రస్తుతం సమ్మర్ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న నయనతార ఫ్యామిలీ సరదాగా తీసుకున్న ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సోషల్ మీడియాలో నయనతార ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. ఆమె ఈసారి తన కొడుకుల ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
నయన్, విఘ్నేష్ శివన్ దంపతుల కొడుకులు అయిన ఉయిర్, ఉలాగ్ లు చూస్తూ ఉండగానే పెద్ద వారు అవుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్న మొన్నటి వరకు నయన్, విఘ్నేష్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి, ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఇంతలోనే పిల్లలు ఇంత పెద్ద వారు కావడం చూస్తూ ఉంటే కాలం ఎంత స్పీడ్‌గా పరిగెడుతుంది కదా అన్నట్లు అనిపిస్తుందని నెటిజన్స్ ఈ ఫోటోలకు తెగ కామెంట్ చూస్తున్నారు. ఉయిర్, ఉలాగ్లను చూస్తూ ఉంటే ముందు ముందు వీరు హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌కి సైన్ చేసింది. ఆ మధ్య ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ జరిగింది. చిరంజీవితో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసింది. భారీ పారితోషికం అందుకుని నయన్ ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. మరో వైపు కోలీవుడ్‌లో రెండు మూడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంది. త్వరలోనే అవి కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవితో చేస్తున్న సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలోనే మరో తెలుగు సినిమాకు కమిట్ అయ్యే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.