నయనతార, త్రిష ఎప్పుడూ ఎక్కడా ఒకరి గురించి ఒకరు మాట్లాడింది లేదు, ఎక్కడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంది లేదు కానీ వీరిద్దరి మధ్య మాత్రం మొదటి నుంచి చాలా గ్యాప్ ఉంది. వీరిద్దరి కెరీర్లు మొదలై చాలా కాలమవుతుంది. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ వీరి మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. అప్పుడెప్పుడో 2008లో వచ్చిన కురువి సినిమాలో నయనతార చేయాల్సిన క్యారెక్టర్ ను త్రిష చేయడంతో ఈ సెలైంట్ వార్ మొదలైందని అందరూ అంటుంటారు.
అప్పుడు మొదలైన ఈ సైలెంట్ వార్ ఇప్పటికీ ఆగడం లేదు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన మూకుతి అమ్మన్ సినిమాను త్రిష వదులుకున్నప్పుడు ఆ సినిమాను నయనతార చేసి దాన్ని సూపర్ హిట్ గా నిలిచేలా చేశారు. ఆ తర్వాత థగ్ లైఫ్ మూవీ ఆఫర్ ముందుగా నయనతార వద్దకు వెళ్లగా ఆమె దాన్ని రిజెక్ట్ చేశారని, ఆ తర్వాతే త్రిష లైన్ లోకి వచ్చిందని అంటారు. కానీ థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాపైంది.
అయితే ఇవన్నీ యాదృశ్చికాలే అయినా వీరు చేస్తున్న సినిమాలు, స్క్రిప్ట్ లు ఎప్పుడూ వారి చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటివరకు స్క్రిప్ట్‌ల విషయంలో చేతులు మారిన సినిమాలు ఇప్పుడు రెమ్యూనరేషన్ కారణంగా చేతుల మారేట్టు కనిపిస్తున్నాయి. అడివెల్లి రీమేక్ కోసం మేకర్స్ నయనతారను సంప్రదించగా ఆమె దాని కోసం రూ.15 కోట్లు అడిగారని సమాచారం. దీంతో ఇప్పుడు నిర్మాతలు త్రిషతో డిస్కషన్స్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో అడివెల్లి రీమేక్ ఎవరితో ముందుకెళ్తుందో చూడాలి. ఇండస్ట్రీలో హీరోయిన్లంతా ఎంతో స్నేహంగా ఉంటూ ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య జరుగుతున్న విషయాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ వాళ్లెప్పుడూ కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు.