విజయవాడ ఇంద్రకీలాద్రి 5వ రోజు శరన్నవరాత్రి అలంకారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సర శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం (ఆశ్వయుజ శుద్ధ చవితి) నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
జగజ్జననిగా మహాలక్ష్మీ రూపంలో ఉన్న అమ్మవారు ఈ రోజున ఎరుపు వస్త్రధారణలో భక్తులను సాక్షాత్కరించారు. “యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా” అని చండీ సప్తశతి వివరిస్తుంది. అందువల్ల శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తే తల్లి సర్వమంగళకారిణిగా ధనం, ధాన్యం, ధైర్యం, విజయము, విద్య, సౌభాగ్యం, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ సందర్భంలో అమ్మవారికి పంచభోగాలైన పాయసం, చక్రపొంగలి, లడ్డు, పులిహోర, దద్యోజనాలను నైవేద్యంగా సమర్పించారు.
🙏 శ్రీ మహాలక్ష్మీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం భక్తులను ఆనందోత్సాహాలతో నింపింది.