సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘కూలీ’ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం కూడా మొదలైంది. లిరికల్ సింగిల్స్ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఇటీవలే పూజాహెగ్డేపై చిత్రీకరించిన `మోనిక` అంటూ సాగే ఐటం పాటను రిలీజ్ చేసారు. మాస్ నెంబర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రెడ్ కలర్ ఔట్ ఫిట్ లో అందాల భామ పూజా స్టెప్ అందుకుంటే? కుర్రాళ్ల గుండెల్లో సలపరం మొదలవుతుంది.
ఈ పాటలో పూజా హెగ్డే ఎనర్జీ మామూలుగా లేదు. గ్లామరస్, రెట్రో-స్టైల్ డ్యాన్స్ మూవ్స్ తో పూజా ఆకట్టు కుంది. పాటలో పూజాహెగ్డే పాత్ర పేరు మోనిక. మరి ఇంతకీ ఎవరీ మోనికా అంటే? మోనికా బెల్లూచికి ఒక ఇటాలీయన్ నటి. మంచి డాన్సర్ కూడా. మోనికా బెల్లూచీకి అనిదరుర్, లోకేష్ కనగరాజ్ లు వీరాభి మానులట. తొలుత ఈపాట మోనికా బెల్లూచీ పూర్తి పేరు మీదే ఉండాలనుకున్నారుట. కానీ తర్వాత పూజా హెగ్డే మోనికగా మార్చినట్లు లోకేష్ తెలిపాడు.
చిన్ననాటి నుంచి ఆమెను ఆరాధించేవాడినని మోనిక నటించిన ‘మాలేనా’ సినిమా అప్పట్లో టీనేజర్స్ అందరికీ హాట్ ఫెవరెట్ గా తెలిపాడు. హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడిదే పేరుతో పూజాహెగ్డే కి లోకేష్ క్యారెక్టర్ రాయడం అంటే లోకేష్ ఆ బ్యూటీకి ఎంతగా కనెక్ట్ అయ్యాడో అద్దం పడుతుంది. మొత్తానికి లోకేష్ కనగరాజ్ అభిమానించే గ్రేట్ పెర్పార్మర్ కూడా ఒకరున్నారని ఈసందర్భంగా బయట పడింది. లొకేష్ గొప్ప క్రియేటర్ మాత్రమే కాదు అంతకు మించి మంచి నటీమణుల విషయంలో మంచి అభిరు చిగల దర్శకుడిగానూ ప్రూవ్ అవుతున్నాడు. మాస్ తో పాటు వెస్ట్రన్ బీట్స్ అందిండచడంలో అనిరుద్ దిట్ట. తనదైన మార్క్ మాస్ కు వెస్ట్రన్ జోడించాడంటే ఆ పాటకు తిరుగుండదు. మోనిక పాట నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.