‘మేఘా’కు మరో భారీ ఆర్డర్!
కర్ణాటకలో ‘వ్యూహాత్మక’ పెట్రో ప్రాజెక్టు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. కర్ణాటకలోని పాదూరు వద్ద 25 లక్షల టన్నుల వ్యూహాత్మక ముడి చమురు నిల్వల కేంద్రాన్ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలిపింది.
ఈ కాంట్రాక్ట్ విలువ రూ. 5,700 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి MEIL త్వరలోనే ప్రభుత్వ రంగంలోని ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ISPRL) తో ఒప్పందం చేసుకోనుందని సమాచారం.
MEIL పాటు మరో రెండు కంపెనీలు కూడా ఈ ప్రాజెక్టు కోసం పోటీపడ్డాయి. అయితే మేఘా ఇంజనీరింగ్ కోట్ చేసిన ధర తక్కువగా ఉండటంతో ISPRL ఈ ప్రాజెక్టును MEILకే కట్టబెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ISPRL ఈ తరహా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ISPRL విశాఖపట్నం, మంగళూరు, పాదూరు వద్ద మూడు వ్యూహాత్మక ముడి చమురు నిల్వల కేంద్రాలను నిర్వహిస్తోంది. పాదూరు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్‌కు అప్పగించబోతోంది.
ఈ విస్తరణతో దేశ వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యం 53.3 లక్షల టన్నులకు చేరనుంది. ఈ నిల్వలు అత్యవసర పరిస్థితుల్లో 8–9 రోజుల అవసరాలకు సరిపోతాయి.
🔑 ప్రాజెక్టు ప్రత్యేకతలు:
5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలి
60 ఏళ్ల పాటు మేఘాకు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు
25 లక్షల టన్నుల వరకు ముడి చమురు నిల్వ సామర్థ్యం
చమురు నిల్వల సదుపాయాన్ని మేఘా స్వయంగా లేదా ఇతరులకు అద్దెకు ఇవ్వవచ్















