ఒక సాంగ్ ఎంత హిట్ అయ్యింది అన్నది సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్ గా సోషల్ మీడియా అటు ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా మీసాల పిల్ల ప్రోమో రిలీజైంది. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఏ సినిమా అయినా పూర్తి సాంగ్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కానీ మన శంకర వరప్రసాద్ సినిమాలో మీసాల పిల్ల సాంగ్ ప్రోమోతోనే సెన్సేషనల్ అనిపించారు. ఎందుకంటే ఈ సాంగ్ ప్రోమో ఇన్ స్టా రీల్స్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఏదైనా సినిమాలో సాంగ్ నచ్చితే వెంటనే సాంగ్ ని రీల్స్ చేస్తారు నెటిజెన్లు.
షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్న మన శంకర వర ప్రసాద్ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపూడి చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు భీమ్స్ మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ చిరు సినిమాకు కూడా అతన్నే రిపీట్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాలోని ఫస్ట్ సాంగ్ గా మీసాల పిల్ల మెలోడియస్ ప్రోమో వచ్చింది. ఐతే ఈ సాంగ్ కి మెగా ఫ్యాన్స్ నుంచే కాదు కామన్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఒక సినిమా తీయడం అందరు చేస్తారు కానీ దాన్ని ఎలా ప్రమోట్ చేయాలన్నది అనిల్ రావిపూడి దగ్గర నేర్చుకోవాలి అనేలా ఆయన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. చిరంజీవి తో మొదటిసారి కలిసి సినిమా చేస్తున్న అనిల్ మెగాస్టార్ వింటేజ్ వైబ్ ని ఈ సినిమాతో చూపిస్తాడని అంటున్నారు. ఇక భీమ్స్ కూడా తన మార్క్ మ్యూజిక్ తో మెగాస్టార్ ని ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
చిరంజీవి, అనిల్, భీమ్స్ ఈ కాంబో కలిసింది మొదటిసారే అయినా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. మీసాల పిల్ల సాంగ్ ప్రోమో చిరంజీవి గ్రేస్ అదిరిపోయింది. 70 ఏళ్ల వయసులో కూడా చిరు ఈ రేంజ్ లో డాన్స్ చేయడం చూసి ఫ్యాన్స్ సూపర్ అనేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు పోటీగా సంక్రాంతి బరిలో భారీ సినిమాలే వస్తున్నాయి. ఐతే ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకంగా వస్తున్నాయి.