మంచు మనోజ్.. మంచు మోహన్ బాబు వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత హీరోగా మారారు. అలా పలు చిత్రాలు చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు వ్యక్తిగత కారణాలవల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న మనోజ్.. అటు కుటుంబ సమస్యలతో కూడా తలమునకులైన విషయం తెలిసిందే. అలా దాదాపు 9 ఏళ్ల ఇండస్ట్రీ విరామం తర్వాత ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మంచు మనోజ్ కాస్త నెగిటివ్ షేడ్ లో కనిపించి సినిమాకే హైలెట్గా నిలిచారు.
ఇప్పుడు మళ్లీ అదే విలనిజంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు మంచు మనోజ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఎపిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ మిరాయ్. ఈ సినిమాలో కూడా మంచు మనోజ్ విలన్ గా నటించబోతున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మేకర్స్ కాసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ ట్రైలర్ చూస్తుంటే అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ తేజ తో పాటు విలన్ గెటప్ లో నటిస్తున్న మంచు మనోజ్ మరింత హైలైట్ అయ్యారు. విలన్ గెటప్ లో మంచు మనోజ్ జీవించేసారని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ చూస్తుంటే మనోజ్ బ్లడ్ లోనే విలనిజం ఉంది అని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.
విలన్ గెటప్ లో మంచు మనోజ్ మేనరిజం, లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకవేళ మిరాయ్ సినిమా హిట్ అయింది అంటే కచ్చితంగా మనోజ్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోతుందనటంలో సందేహం లేదు. నిజానికి మంచు మోహన్ బాబు ఇప్పటివరకు హీరోగా, విలన్ గా , కమెడియన్ పాత్రలు చేసిన జనాలు చూశారు. ఆయన ఆయా పాత్రలలో నటించి మెప్పించారు కూడా.. కానీ ఇప్పుడు మంచు మనోజ్ ను చూస్తుంటే ఈయన హీరోగా కంటే విలన్ గానే ఒదిగిపోతారని.. ఆయన రక్తంలోనే విలనిజం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. మొత్తానికైతే మనోజ్ హీరోగా కంటే విలన్ గానే బాగా సెట్ అవుతాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. మేజర్ చంద్రకాంత్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టిన మనోజ్.. 2004లో దొంగ దొంగది సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బిందాస్ సినిమాతో ఏకంగా నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పొలిటికల్ రౌడీ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించిన ఈయన.. రాజు భాయ్, ప్రయాణం, వేదం , నేను మీకు తెలుసా ?, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య ఇలా ఎన్నో చిత్రాలలో నటించారు. ఇప్పుడు వాట్ ది ఫిష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు.