టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే. ప్రణతిను వివాహం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. కొంతకాలంపాటు ఆయన పూర్తిగా కనిపించలేదు. రిషికేష్‌లోని ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపారని టాక్. ఆ తర్వాత హైదరాబాద్ రాగా, భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికతో కనిపించారు.
దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనుకున్నట్లే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మౌనికను పెళ్లి చేసుకున్నారు మనోజ్. అనంతరం సినిమాలకు బ్రేక్ ఆయన.. పెద్దగా కనిపించలేదు. దీంతో చెన్నైలో ఉంటున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఇప్పుడు ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచిన విషయాన్ని మనోజ్ గుర్తు చేసుకున్నారు.
“మా ఇంట్లో గొడవలు జరుగుతున్న సంగతి పవన్ అన్నకు తెలిసింది. దీంతో ఓ రోజు నన్ను పక్కకి పిలిచి ఎక్కడ ఉంటున్నావ్? ఏం కనపడట్లేదు? మొత్తం విన్నానని అన్నారు. ఏం చేస్తున్నావ్? వేర్ ఆర్ యూ అని అడిగారు. నేను చెన్నైలో ఉంటున్నాని చెప్పా. ఎందుకు అక్కడికి వెళ్లిపోయావ్ అని పవన్ నన్ను అడిగారు” అని చెప్పారు. “అప్పుడు నా లైఫ్ లో మౌనిక ఉంది అన్న. హైదరాబాద్ లో ఇబ్బందిగా ఉంది. అందుకే చెన్నైలో ఉంటున్నా. కొద్ది రోజులు పని చేసి కాస్త సెట్ అయ్యాక హైదరాబాద్ వద్దామనుకున్నా అని చెప్పా. అలా అప్పుడు వెళ్లిపోయామని చెప్పా. నీవేం అలా పెట్టుకోకు.. నా మాట విని.. చెన్నై వచ్చినప్పుడు నేను కలుస్తా.. ధైర్యంగా ఉండు” అని తెలిపారు.
“నన్ను వచ్చి కలువు.. కచ్చితంగా కమ్ బ్యాక్ ఇవ్వాలని అన్నారు. అలా నాకు, మౌనికకు సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ పవన్ అన్న. ఇప్పటి వరకు అది ఎప్పుడూ చెప్పలేదు. నన్ను షూటింగ్ కు రమ్మన్నారు. అప్పుడు భీమ్లా నాయక్ సెట్స్ కు వెళ్లాను. చాలా సేపు మాట్లాడారు. క్లాస్ కూడా పీకారు. ముందు ఫిట్ అవ్వమన్నారు” అని చెప్పారు. “డైట్ చెయ్.. ఏదైనా చెయ్.. బరువు తగ్గాలని అన్నారు. ఓ హీరోగానే కాకుండా.. ఏ క్యారెక్టర్ అయినా చేయమన్నారు. నీవు గుడ్ యాక్టర్ అని ఎంకరేజ్ చేశారు. అదే ఇప్పుడు నాకు పనికొచ్చింది. ఇప్పుడు ఏ సినిమా అయినా చేయగలను. థాంక్యూ పవన్ అన్న.. లవ్ యూ..” అంటూ మనోజ్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.