మెగాస్టార్ చిరంజీవి.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్వయంకృషితో నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా హీరోగానే కాకుండా రాజకీయ నేతగా కూడా చలామణి అయిన ఈయన.. సమాజసేవ చేస్తూ మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. మంచి కామెడీ టైమింగ్ తో పాటు సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు.
మాస్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే చిరంజీవి.. అన్నయ్య, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి ఎన్నో చిత్రాలలో తన సెన్సాఫ్ హ్యూమర్ తో ప్రేక్షకులను అలరించారు కూడా.. ఇక సినిమాలలో ఎలా అయితే జోవియల్ గా ఉంటారో బయట వ్యక్తులతో కూడా ఆయన అలాగే ఉంటారని.. ఇప్పటికే ఎంతోమంది పలు సందర్భాలలో వెల్లడించారు కూడా.
ఇప్పుడు మరొకసారి ప్రముఖ నటుడు హర్షవర్ధన్ కూడా ఆయనతో గడిపిన క్షణాలను, తమ మధ్య ఏర్పడిన ఫన్నీ మూమెంట్స్ ను గుర్తు చేసుకుంటూ ఆయన గురించి మరొకసారి కామెంట్లు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో కూడా హర్షవర్ధన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి ఒక ఇంటర్వ్యూలో తెలిపి అందరిని ఆశ్చర్యపరిచారు హర్షవర్ధన్.
ప్రముఖ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా కూడా పేరు సంపాదించుకున్న హర్షవర్ధన్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఒకరోజు సినిమా షూటింగ్లో ఖాళీ సమయం దొరకడంతో చిరంజీవి నా దగ్గర వచ్చి కూర్చున్నారు. ఆయన చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ..” హర్ష నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలయ్యా” అని అన్నారు. దానితో నేను చాలా ఎమోషనల్ అయిపోయాను . అంతలోనే చిరంజీవి..” నువ్వు నా పక్కన ఉంటేనే కదా.. నేను ఎంత సన్నగా, ఫిట్గా ఉన్నానో తెలిసేది” అంటూ పంచ్ వేశారు. మళ్లీ అంతటితో ఆగకుండా “నువ్వు నా పక్కన లేకుంటే నేను బ్రతకలేను మరి.. నువ్వే నాకు దిక్కు.. నాకు ఎవరూ లేరు” అంటూ నన్ను ఆట పట్టించారు” అంటూ హర్ష చిరంజీవి తనను ఆటపట్టించిన విధానాన్ని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇకపోతే చిరు ఆర్టిస్టులతో ఎంత సరదాగా ఉంటారో, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఎలాంటిదో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ అని హర్ష నవ్వేశాడు. దీంతో ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ కి .. హర్ష మాటలు విన్న యాంకర్ కూడా తెగ పగలబడి నవ్వేశారు.
ఇకపోతే హర్ష మాటలు విన్న నెటిజన్స్ మాత్రం చిరులోని ఈ కామెడీ టైమింగ్ ను అనిల్ రావిపూడి గనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే.. మన శంకర్ వరప్రసాద్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అసలే నటులను ఎలా వాడుకోవాలో తెలిసిన అనిల్ రావిపూడి.. చిరంజీవిలోని ఆ సెన్సాఫ్ హ్యూమర్ ని వాడుకోకుండా ఉంటారా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇద్దరు దిగ్గజాలు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే.