యానిమల్, పుష్ప సినిమాలతో నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు పాన్ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చింది. ఈ విజయాలతో రష్మిక టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలు అందుకంటుంది. దీంతో ఆమె ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ గా కొనసాగుతోంది.
మరోవైపు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కూడా దాదాపు ఇంతే. ఆమె సైతం టాలీవుడ్ సహా బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది. ఆమె హీరోయిన్ గా నటించిన జూనియర్ సినిమా రిలీజ్ కూడా రెడీగా ఉంది. ఇలా రష్మిక, శ్రీలీల ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి కంటే బిజీగా ఉన్న హీరోయిన్ కూడా ఉన్నారు.
ఆమె ఎవరో కాదు, మలయాళ బ్యూటీ మమిత బైజు. తొలి సినిమా ప్రేమలుతో మమిత కుర్ర కారు క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో అల్లరి చేస్తూ నటించి మెప్పించింది. నటనతో అందరి ప్రశంసలు పొందింది. ఈ సినిమాతో పలు భాషల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ గా మమిత ఉంది. ఒక్క ప్రేమలు విజయంతో అనేక అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమా చేస్తుంది. ఆయన 69వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న జననాయకుడు సినిమాలో మమిత కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్క విజయంతోనే టాప్ హీరో విజయ్ సినిమాలో చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదు. ఇది విజయ్ కెరీర్ లో ఆఖరి సినిమాగా తెరకెక్కుతోంది.
అలాగే ధనుష్, సూర్య, వంటి అగ్రశ్రేణి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రదీప్ రంగనాథన్, సంగీత్ ప్రతాప్ వంటి యంగ్ హీరోల అప్ కమింగ్ సినిమాల్లోనూ ఛాన్స్ పట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే మలయాళ హీరో నివిన్ పౌలీ సినిమాలోనూ లీడ్ ఫీమేల్ లీడ్ లో నటించడానికి ఎంపికైంది. అంతేకాకుండా మంచి విజయం దక్కించుకున్న ప్రేమలు సీక్వెల్ కూడా సన్నాహాలు చేస్తున్నారట. ఇలా పలు స్టార్ హీరోల సరసన ఛాన్స్లు దక్కించుకొని చేతినిండా సినిమాలతో బీజీబీజీగా గడిపేస్తుంది. దీంతో త్వరలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్లో మమిత చేరనుంది