ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చాలామంది అలా పెళ్లి చేసుకుని ఇలా విడిపోతున్నారు. విడిపోయిన వారు మళ్లీ జీవితంలో కొత్త తోడును వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాను కూడా రెండో పెళ్లికి సిద్ధం అంటూ 51 ఏళ్ల వయసులో షాకింగ్ కామెంట్స్ చేసింది హాట్ హీరోయిన్. ఆమె ఎవరో కాదు మలైకా అరోరా. అటు వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ చెప్పడంతో పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ‘బిచ్చో’ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఒక కుమారుడు కూడా జన్మించారు.. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. వైవాహిక బంధంలో ఇద్దరు విడిపోయినా.. కుమారుడి బాధ్యతలను మాత్రం ఇద్దరూ సమానంగా తీసుకోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం.ఇకపోతే భర్త నుంచి విడిపోయిన తర్వాత మలైకా తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. కొంతకాలం పార్టీలకు, వెకేషన్ లకి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అనూప్యంగా విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు ఈ జంట.
ఇలాంటి సమయంలో ఇప్పుడు మళ్లీ మలైకా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. మలైకా మాట్లాడుతూ..” నేను, అర్భాజ్ ఖాన్ భార్య భర్తలుగా విడిపోయినా మా కొడుకు కోసం తల్లిదండ్రులుగా నిలబడ్డాము. ప్రస్తుతం వాడికి 22 ఏళ్ళు వచ్చాయి. ఎక్కడ ఎలా మాట్లాడాలో అతడికి బాగా తెలుసు. విడాకుల వల్ల నా కొడుకు జీవితం ఎఫెక్ట్ కాకూడదని ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. నిజానికి నా భర్త నుండి నేను విడాకులు తీసుకోవాలని అనుకోలేదు. కలిసే ఉండాలని అనుకున్నాను. కానీ తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు చాలామంది నన్నే నిందించారు. వేలెత్తి చూపించారు. సెల్ఫిష్ అంటూ విమర్శించారు. కానీ అన్నింటిని ఓర్చుకున్నాను.
ప్రస్తుతం నేను ఆనందంగా ఉండాలని.. గతంలో వివాహ బంధం నుంచి బయటకు వచ్చాను. ఆ నిర్ణయం నన్ను ఇప్పుడు మెరుగైన వ్యక్తిగా మార్చడానికి సహాయపడింది. నేను ఒక హార్డ్ కోర్ రొమాంటిక్ వ్యక్తిని. నేను ప్రేమను చాలా బలంగా నమ్ముతాను. కాబట్టి మంచి వ్యక్తి దొరికితే మళ్ళీ కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను”. అంటూ మలైకా అరోరా కామెంట్లు చేసింది. ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వయసులో మళ్లీ రెండో పెళ్లి ఏంటి అంటూ పలువురు పలు కామెంట్లు చేస్తున్నారు. మరి మలైకా అరోరా మనసును మెచ్చే ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడో చూడాలి.
Malaika Arora Latest Snaps #Malaika #MalaikaArora pic.twitter.com/ms0cdtlFtu
— news7telugu (@news7telug2024) August 18, 2025