బాలీవుడ్ నటి మలైకా అరోరా డ్యాన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి మలైకా డాన్స్ పట్ల తన కొడుకు ఎలాంటి విమర్శలు చేస్తాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నిజాయితీగా తన కొడుకు చెప్పే ఆ విమర్శలు తనని ఆశ్చర్యానికి గురిచేస్తాయి అంటూ చెప్పింది.. అయితే మలైకా అరోరా కొడుకు నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెబుతూ నవ్వులు పుట్టిస్తాడట. అదే సమయంలో విమర్శలు కూడా చేస్తాడట. మరి ఇంతకీ మలైకా అరోరా డ్యాన్స్ పై ఆమె కొడుకు ఎలాంటి విమర్శలు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన డాన్స్ స్టెప్పులతో ఎంతోమందిని అలరించింది. ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలా ఎంతోమంది మలైకా అరోరా డ్యాన్స్ ని ఇష్టపడతారు.అయితే ఎంతోమంది ఆమె డాన్స్ ని మెచ్చుకున్నప్పటికీ ఆమె కొడుకు అర్హాన్ ఖాన్ మాత్రం కొన్ని విమర్శలు చేస్తారట. ఆ విమర్శల గురించి తాజా ఇంటర్వ్యూలో మలైకా అరోరా చెబుతూ.. “నా కొడుకు నా డాన్స్ పట్ల నిజాయితీగా విమర్శలు చేస్తాడు. నా డాన్స్ గురించి నువ్వు అలా ఎప్పటికీ డాన్స్ చేయలేవు అంటూ నా మొహం మీదే చెబుతాడు. అలా చెప్పడం వల్ల నేను నా డ్యాన్స్ లో మరిన్ని మెలకువలు నేర్చుకుంటాను. అలా అర్హాన్ ఖాన్ నా మొహం మీదే నిర్మొహమాటంగా డాన్స్ గురించి విమర్శలు చేస్తాడు. వాడి నిజాయితీకి నేను నిజంగా ఆశ్చర్యపోతాను. అర్హన్ ఖాన్ చేసే వ్యాఖ్యలు నాలో మరింత ఉత్సాహం నింపి నృత్య ప్రదర్శనలో మరిన్ని కొత్త స్టెప్పులు నేర్చుకునేలా ప్రోత్సాహం ఇస్తాయి..
అర్హాన్ ఖాన్ ఏదైనా సరే నిజాయితీగా చెబుతాడు. వాడి అభిప్రాయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే ఎంతోమంది నా డాన్స్ ని బహిరంగంగా ప్రశంసించినప్పటికీ అర్హాన్ ఖాన్ చెప్పే విమర్శలు మాత్రం నాకు కాస్త భిన్నంగా అనిపిస్తాయి. నా గురించి నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అర్హాన్ ఖాన్ మాత్రమే అనిపిస్తుంది” అంటూ ఒక కొడుకుతో ఉండే బాండింగ్ గురించి తల్లిగా తన అభిప్రాయాలను బయటపెట్టింది మలైకా అరోరా.
అంతేకాదు కొడుకు నువ్వు ఆ పని చేయలేవు.. నువ్వు ఆ స్టెప్ వేయలేవు అని అంటే మలైకా అరోరా తన డ్యాన్స్ లో మరింత మెలకువలు నేర్చుకొని దాన్ని చేసి చూపిస్తుందట. అలా కొడుకును ఆకట్టుకోవడం కోసం కొత్త కొత్త స్టెప్పులు కూడా నేర్చుకుంటున్నానని ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే అర్హాన్ ఖాన్ చేసే సరదా విమర్శలు కఠినంగా ఉండవు ఫన్నీగా మాత్రమే ఉంటాయి. మా ఇద్దరి మధ్య కామెడీ సంభాషణలు ఎన్నో ఉంటాయి. ఇవి మా బంధాన్ని మరింత బలపరుస్తాయి అంటూ మలైకా చెప్పుకొచ్చింది. అలాగే నేను ఎంతగానో ప్రేమించే నా కొడుకు నన్ను ఇలా విమర్శించడం వల్ల నేను నా డాన్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక మార్గం భావించి వాడి మాటలను మైండ్ లో పెట్టుకునే దాన్ని.ఈ విషయంలో నా డ్యాన్స్ పట్ల కేర్ తీసుకుంటున్న అర్హాన్ ఖాన్ ని ఎప్పుడు అభినందిస్తూనే ఉంటా అంటూ మలైకా అరోరా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..
మలైకా అరోరా పర్సనల్ లైఫ్ కి వస్తే.. ఈ హీరోయిన్ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకొని అర్హాన్ ఖాన్ కి జన్మనిచ్చాక విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఇక విడాకులయ్యాక కొద్ది సంవత్సరాలకే బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్ తో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది.అలా వయసులో తనకంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ డేటింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయినా కూడా వాటిని పట్టించుకోలేదు. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక మలైకా అరోరా విడుదలకు సిద్ధంగా ఉన్న థామా మూవీలో పాయిజన్ బేబీ అనే స్పెషల్ సాంగ్ చేసింది.