బికినీ బీచ్ విహార యాత్రలతో తన ఇన్ స్టా అభిమానులకు ట్రీట్ ఇవ్వడంలో మలైకా ఎప్పుడూ వెనకాడదు. ఇటీవల కొంత కాలంగా టస్కానీ యాత్ర నుంచి రకరకాల ఫోటోషూట్లను మలైకా షేర్ చేయగా అవన్నీ వైరల్ గా మారాయి. ఇప్పటికీ మలైకా అరోరా టస్కానీ డైరీస్ నుంచి చిల్లింగ్ ఫోటోషూట్లు వెబ్ ని ముంచెత్తుతున్నాయి. మల్లా చిల్ వైబ్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మలైకా అరోరా కొద్దిరోజులుగా తన కుమారుడు అర్హాన్ ఖాన్‌తో కలిసి టస్కానీ బీచ్ లలో సెలవులను గడుపుతోంది. వెకేషన్ లో ఆస్వాధనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కుమారుడు అర్హాన్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసిన 51 ఏళ్ల మలైకా.. వాటితో పాటు వరుసగా బికినీ, స్విమ్ సూట్లలో ఉన్న ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తుంటే అవన్నీ వెబ్ లో సునామీ సృష్టిస్తున్నాయి.
51 వయసులో ఇంతటి అందం, వేడి ఎలా సాధ్యం మ్యాడమ్ ? యాభైలో ఇరవై చూపిస్తున్నారు! అంటూ అభిమానులు ఈ ఫోటోషూట్లపై కామెంట్ చేస్తున్నారు. తాజాగా మలైకా ఓ యూనిక్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. ఈసారి పింక్ బికినీలో దుమారం రేపింది. మలైకా టూపీస్ బికినీ స్పెషల్ గా ఎలివేట్ అవ్వడంతో ఇది క్షణాల్లో వెబ్ లో వైరల్ గా మారింది. అందమైన బీచ్ రిసార్ట్, చుట్టూ బులుగు సముద్రం, అక్కడ మలైకా రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ యూత్‌లో దుమారం రేపుతోంది. టస్కానీ టూర్ ముగించాక తిరిగి మలైకా తన రియాలిటీ షో వ్యవహారలతో బిజీ అవుతుంది.