ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిన వీరు ఒకవైపు ఇలా అందాలతో ఆకట్టుకుంటూనే మరొకవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఆదాయాన్ని కూడా పొందుతున్నారు.
ఇంకొంతమంది తమ సినిమా ప్రమోషన్లకు సంబంధించిన విషయాలను అలాగే.. వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుంటేనే సినిమాలలో అవకాశాలు వస్తాయనే వాదన కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ కూడా తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఆమె ఎవరో కాదు మడోన్నా సెబాస్టియన్. తన నటనతోనే కాదు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బీచ్ వడ్డున సేదతీరుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ సముద్రుడికే చెమటలు పట్టించేలా తన అందాలతో హీట్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం మడోన్నా సెబాస్టియన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అమ్మడి అందం రోజురోజుకు పెరుగుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకి ఫాలోవర్స్ కూడా పెరిగిపోతున్నారని చెప్పవచ్చు. అంతేకాదు విపరీతమైన లైకులు, షేర్లు కూడా వస్తున్నాయి.
మడోన్నా సెబాస్టియన్ మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమా ద్వారా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో తెలుగు, తమిళ్ భాషలలో కూడా అవకాశాలు అందుకుంది. 1992 అక్టోబర్ ఒకటో తేదీన కేరళలోని కన్నూర్ లో చెరుపూజాలోని బేబీసిడి దేవాసియా , శైలా బేబీసిడి దంపతులకు జన్మించింది.. సెయింట్ పీటర్స్ సీనియర్ సెకండరీ స్కూల్, కడాయిరప్పులో ఉన్నత చదువులు పూర్తి చేసింది. START కోజీకోడ్ లో ఒక ఏడాది పాటు మాస్టర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో పట్టభద్రురాలు అయింది.
మలయాళంలో విడుదలైన ప్రేమమ్ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడంతో ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటించింది. ఎక్కువగా తమిళ్, మలయాళం చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. సినిమాలలోనే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికొస్తే.. హార్టిన్ చిత్రంతోపాటు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న బెంజ్ సినిమాలో కూడా నటిస్తోంది. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.











