ఏపీలో మందుబాబులకు కొత్త రూల్.. లిక్కర్ షాపుల్లో అమలు, చంద్రబాబు కీలక ఆదేశాలు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని..
డిజిటల్ చెల్లింపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎర్రచందనం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా ఆయన సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పెరుగుదల రాబడిలో కనిపించాలని కలెక్టర్లకు సూచించారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మద్యం షాపుల్లో పూర్తిగా డిజిటల్ చెల్లింపులు జరగాలన్నారు. డిజిటల్ చెల్లింపులు చేసిన షాపుల్లో తదుపరి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు.
బార్ల ఏర్పాటులో సమస్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. బార్లకు సరఫరా చేసే మద్యం ధర ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల బార్ల ఏర్పాటు ఆలస్యమైందని కొందరు అభిప్రాయపడ్డారు. సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సీఎం అధికారులకు సూచించారు. షాపుల కన్నా బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16% ఎక్కువని..ఇది సమస్యగా ఉందని అధికారులు వివరించారు. పర్మిట్ రూమ్‌లకు మొదట అనుమతి ఇచ్చారు.. ఆ తర్వాత బార్ల ఏర్పాటుకు వెళ్లడంతో సమస్య వచ్చిందని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. దీనికి గల కారణాలను అన్వేషించాలని సీఎం చెప్పారు.
రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టి సారించారు. ఎర్రచందనం ద్వారా ఆశించిన ఫలితం రాలేదు అన్నారు. ఎర్రచందనానికి విలువ పెంచి అమ్మాలని.. దీని ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) పెరుగుదల రాబడిలో కనిపించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. తదుపరి సమావేశానికి ఫలితాలు చూపించాలని ఆయన అన్నారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఎర్రచందనం ద్వారా ఆశించిన ఆదాయం రాలేదన్నారు. తిరుపతి డిపోలోనే బొమ్మలు తయారు చేయిస్తే ఎక్కువ లాభం వస్తుందన్నారు. ఎర్రచందనం విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని.. దీనిని సరిగ్గా ఉపయోగించాలన్నారు. ఎర్రచందనం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.