మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లైన దగ్గర నుంచి సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కోడలిగా ఇంటి బాధ్యతలకే పరిమితమయ్యారు. పెళ్లైన తర్వాత `లీలావతి` సినిమాకు కమిట్ అయి పట్టా లెక్కిం చినా సీరియస్ గా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఆ సినిమా ఇంకా ఆన్ సెట్స్ లోనే ఉంది. పెళ్లికి ముందు ఓ తమిళ సినిమా కు కమిట్ అయింది. ఆ సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
కుటుంమంతా సంతోషంగా:
మరి తాజా పరిణామాల నేపథ్యంలో మెగా కోడలు మళ్లీ సినిమాల్ని సీరియస్ గా తీసుకోతున్నారా? మును పటిలా బిజీ నటిగా మారే ప్రణాళిక సిద్దం చేస్తున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. ఇటీవలే లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ పుల్ ఖుషీగా ఉంది. ఇల్లాంతా ఆడ పిల్లలతో నిండిపోయింది వారసుడు కావాలి అంటూ చిరంజీవి అన్న నేపథ్యంలో వరుణ్ తేజ్ కు కొడుకు పుట్టడంతో ఆయనెంతో సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి మళ్లీ నటిగా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది మిడ్ నుంచి మళ్లీ లావణ్య సీరియస్ గా కెరీర్ పై దృష్టి పెట్టే అవకాశం ఉందంటున్నారు. కొత్త సినిమాలతో జోరు పెంచాలని ఆమె కూడా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం లావణ్య బాలింత కావడంతో విశ్రాంతిలో ఉన్నారు. కోలుకున్న అనంతరం మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో పెళ్లికాని నటీమణులు కంటే పెళ్లైన నటులకే ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకునే వారు వారే.
పారితోషికం కూడా రెట్టింపు అందు కుంటున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య కూడా కంబ్యాక్ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రోఫెషనల్ గా మెగా ఫ్యామిలీ ఎలాంటి అడ్డంకి చెప్పదు. కావాల్సినంత స్వేచ్ఛ కల్పిస్తున్నారు. ఇప్పటికే నిహారిక కూడా సినిమాలతో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇంతకాలం మీడియా కంట కనిపించడం తక్కువైనా? నిర్మాతగా మారిన నేపథ్యంలో సుస్మిత కూడా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ప్రోపెషనల్ -పర్సనల్ కెరీన్ ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.