ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

 Lalit Modi: లలిత్ మోడీకి బిగ్ షాక్.. వనౌటూ పౌరసత్వం రద్దు!

 Lalit Modi: లలిత్ మోడీకి బిగ్ షాక్.. వనౌటూ పౌరసత్వం రద్దు!
ADVERTISEMENT

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి మరోసారి షాక్ తగిలింది. వనౌటు దేశ ప్రభుత్వం అతనికి ఇచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం పెద్ద దెబ్బగా మారింది. కేవలం నేర విచారణ నుంచి తప్పించుకోవడానికి పౌరసత్వాన్ని పొందడం సరైన కారణం కాదని వనౌటు ప్రధాన మంత్రి జోథమ్ నపాట్ స్పష్టంచేశారు. దీంతో లలిత్ మోడీ కోసం కొత్త సమస్యలు తలెత్తాయి. ఇటీవలే ఆయన భారత హైకమిషన్‌కు తన పాస్‌పోర్టును వదులుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు,

ఇప్పుడు వనౌటు సైతం వెనక్కి తగ్గడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. వనౌటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇంటర్‌పోల్ నివేదిక కీలక కారణమైంది. మోడీపై భారత ప్రభుత్వం పెట్టిన రెడ్ నోటీసును ఇంటర్‌పోల్ రెండు సార్లు తిరస్కరించినప్పటికీ, తాజా అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం అతను పౌరసత్వాన్ని తప్పించుకునే ఉద్దేశంతో పొందినట్లు స్పష్టమైంది.

వనౌటు ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తమ పౌరసత్వ విధానాన్ని కఠినతరం చేస్తూ అనుమానాస్పద వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. భారత ప్రభుత్వం ఇప్పటికీ లలిత్ మోడీపై దర్యాప్తును కొనసాగిస్తోంది. ఆయన పాస్‌పోర్టును వదిలినా, కేసుల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వనౌటు పౌరసత్వం రద్దవుతే, మోడీ తిరిగి భారత ప్రభుత్వం విచారణకు హాజరవ్వాల్సిన అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

2010లో భారత్ విడిచిన లలిత్ మోడీపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే లండన్‌లో నివసిస్తున్న ఆయన ఇప్పుడు వనౌటు మద్దతును కోల్పోయిన నేపథ్యంలో, తదుపరి ప్రణాళిక ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. భారత్‌కు తిరిగి రావడం తప్పదా? లేక మరో దేశం ద్వారా రక్షణ పొందే ప్రయత్నం చేస్తాడా? అన్న దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీపై పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రాగా.. లండన్ పారిపోయి అక్కడే ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే భారత్ ఆయన్ను తిరిగి రప్పించేందుకు లండన్‌తో సంప్రదింపులు జరపగా.. ఆయన అక్కడి నుంచి కూడా వేరే దేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే వనౌటు దేశ పౌరసత్వం పొందారు. రెండ్రోజుల క్రితమే ఆయన ఆ దేశ గోల్డెన్ పాస్‌పోర్ట్ పొందినట్లు వెలుగులోకి రాగా.. తాజాగా ఆ దేశ ప్రధాని లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు పౌరసత్వం ఇచ్చారు, ఎందుకు రద్దు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయిపోయారు. అంతేత్వరగా అప్రతిష్టపాలు కూడా అయ్యారు. ముఖ్యంగా మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కేసుల్లో ఇరుక్కోగా.. దేశం విడిచి పారిపోయారు. 2010వ సంవత్సరంలో లండన్ పారిపోయిన ఆయన అక్కడే ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారత్ మాత్రం అతడిని కచ్చితంగా తిరిగి దేశానికి తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.

దీంతో లలిత్ మోదీ అక్కడి నుంచి తన మకాన్ని వేరే దేశానికి మార్చాలని భావించారు. ఈక్రమంలోనే అన్ని వసతులు, ఎలాంటి షరతులు లేని పసిఫిక్ ద్వీప దేశం అయి వనౌటూకు వెళ్లేందుకు అక్కడి పౌరసత్వాన్ని పొందారు. ఎన్నో డబ్బులు ఖర్చు చేసి మరీ ఆ దేశ గోల్డెన్ పాస్‌పోర్టును కొనుగోలు చేశారు. రెండ్రోజుల క్రితమే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అంతర్జాతీయ మీడియాలు సైతం ఆయన చేసిన నేరాలపై మరోసారి వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలు చూసిన వనౌటు దేశ ప్రధాన మంత్రి ఆయన పౌరసత్వాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో ఇటీవల వెల్లడైన వార్తల నేపథ్యంలో లలిత్ మోదీకి జారీ చేసిన వనౌటు పాస్‌పోర్టును రద్దు చేయాలని ఆ దేశ పౌరసత్వ కమిషన్ ఆదేశించినట్లు నేరుగా ఆయనే ప్రకటించారు. ఆయన తమ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇంటర్ పోల్ స్క్రీనింగ్‌లతో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీల్లో అతడు ఎలాంటి నేరాలకు పాల్పడినట్లు ఆధారాలు లేవని గుర్తించినట్లు చెప్పారు.

కానీ లలిత్ మోదీ వనౌటు పౌరసత్వం పొందిన తర్వాత… గత 24 గంటల్లోనే రెండు సార్లు భారత్ అతడిని అప్పగించాలంటూ హెచ్చరిక నోటీసు జారీ చేసిందన్నారు. కానీ ఇంటర్ పోల్ దాన్ని తిరస్కరించిందని.. ఆ విషయం తెలిసిన వెంటనే అతడి పౌరసత్వాన్ని రద్దు చేయాలని తాను ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని స్పష్టం చేశారు.

Tags: #LalitModi#LalitModiIPL#LalitModiScandal
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 Syria : అంతర్యుద్ధంతో అట్టడుకుతోన్న సిరియా..ఎక్కడ చూసినా శవాలె..!

Next Post

  Cricket : ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ సందేశాలకు చెక్!

Related Posts

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews
Big Story

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews
Big Story

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics
Big Story

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Next Post
  Cricket : ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ సందేశాలకు చెక్!

  Cricket : ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ సందేశాలకు చెక్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#Jailer2, #Jailer2MovieReview, #Jailer2Review, #Rajinikanth, #SuperstarRajinikanth, #NelsonDilipkumar, #AnirudhRavichander, #TamilCinema, #TeluguMovieReview, #MovieReview, #Jailer2TeluguReview, #Kollywood, #RamyaKrishnan, #YogiBabu, #SJSurya, #CinemaNews, #EntertainmentNews, #News7Telugu

Jailer2MovieReview : రజనీకాంత్ మాస్ అదుర్స్.. కథ ఎలా ఉంది?

#YadadriPowerPlant, #TelanganaPolitics, #BRS, #Congress, #KCR, #KTR, #KrishnaRiverWater, #GodavariRiver, #TelanganaWaterRights, #PalamuruRangareddy, #IrrigationProjects, #ThermalPowerPlant, #CoalImport, #Singareni, #PowerGeneration, #TelanganaGovernment, #PoliticalNews, #TelanganaAssembly, #PublicFunds, #TelanganaNews

Telangana:కృష్ణా జలాల నుంచి యాదాద్రి పవర్ ప్లాంట్ వరకు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ ఘాటు విమర్శలు

#SriSathyaSaiDistrict, #ZPChairman, #ZillaParishad, #ParitalaSriram, #KethireddyVenkataKrishnaReddy, #VajraBhaskarReddy, #Mudigubba, #Kadiri, #Dharmavaram, #AndhraPradeshPolitics, #TDP, #YSRCP, #LocalBodyElections, #ZPTCElections, #PoliticalAnalysis, #AndhraPolitics, #DistrictPolitics, #ZPChairmanRace, #ElectionUpdates, #PoliticalNews

ZPChairman:జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి? ముదిగుబ్బ నుంచే పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి పోటీనా?

AndhraPradeshPolitics

AndhraPradeshPolitics:పల్లకీ మోసిన కార్యకర్తలకు పదవులు దక్కేనా?టికెట్ల పంచాయితీ.. కార్యకర్తలకు న్యాయం జరిగేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info