హైదరాబాద్- బెంగళూరు మధ్య నడిచే ట్రావెల్స్ బస్సు ఒకటి కర్నూలు జిల్లాలో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.బస్సు దగ్ధం ఘటనలో 19మంది మృతి.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కర్నూలు శివారులో, కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద, నేషనల్ హైవే 44పై తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
బైకు ఒకటి బస్సును ఢీకొని, దానికి కిందికి వెళ్లిపోయి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ప్రయాణికులు బస్సులోనే సజీవదహనమయ్యారు. అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటనేది అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.బస్సుకు నిప్పంటుకున్నట్లు గ్రహించిన కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
గాయాలపాలైన కొందరు ప్రయాణికులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షేమంగా బయటపడ్డ మరికొందరు ప్రయాణికులు, తమ సొంత ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద వివరాలను కర్నూల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వెల్లడించారు.”ఈ ప్రమాదం తెల్లవారు జామున 3 గంటల నుంచి 3: 10 గంటల మధ్య జరిగింది. బైకును బస్సు ఢీకొనడంతో, ఇంధనం లీక్ అయ్యి, మంటలు చెలరేగాయి. 41 మంది ప్రయాణికుల్లో 21 మందిని రక్షించారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించాం. మిగిలినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని కలెక్టర్ సిరి చెప్పారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధాకరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు.కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ ద్వారా స్పందించారు.
“కర్నూలు జిల్లాలోని చిన్న టేకూర్ గ్రామం సమీపంలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదం గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా” అని సీఎం చంద్రబాబు తెలిపారు.గాయపడిన వారికి, బాధిత కుటుంబాలకు అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఆయన పేర్కొన్నారు.
బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్‌లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061.
బస్సు ప్రమాద స్థలాన్ని కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బైస్సు కిందకు వెళ్లడంతో బస్సులోని ఓ కేబుల్ తెగిపోయిందని తెలిపారు. అనంతరం మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. బస్సు నుంచి 11 మృతదేహాలు వెలికితీసినట్లు పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని.. అతని గురించి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు.
బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్‌లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061, కర్నూలు పోలీసు స్టేషన్: 91211 01075, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో: 94946 09814, 90529 51010. ఏవైనా సమస్యల ఉంటే కంట్రోల్ రూమ్‌లకు ఫోన్ చేసి తెలియజేయాలని కలెక్టర్ సిరి కోరారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్నందున అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే విజయానంద్, ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు…
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 24, 2025
Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…
— PMO India (@PMOIndia) October 24, 2025
ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు.
19 మంది ప్రాణాలు కోల్పోయారు.బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.
అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.టూవీలర్‌ను బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకే 4 బృందాలు పనిచేస్తున్నాయి.ఏపీకి చెందిన మృతులకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తాం.తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కూడా వాళ్ల ప్రయాణికులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాయి : హోంమంత్రి వంగలపూడి అనిత
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు.. ఉదయం 6 గంటలకు ఘటనాస్థలికి వచ్చి పరిస్థితిని సమీక్షించాం.బస్సులో 36 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులు ఉన్నారు.. మృతుల్లో బాపట్ల, నెల్లూరు, కోనసీమ జిల్లాల వాళ్లు ఉన్నారు.
ఒక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది.. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి.మృతదేహాలు గుర్తించేందుకు బృందాలు ఏర్పాటు చేశాం.. ప్రమాదంపై 16 ఫోరెన్సిక్ బృందాలు ఏర్పాటు చేశాం.బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం.. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.బస్సుకు ఆలిండియా పర్మిట్, ఫిట్‌నెస్ పత్రాలు ఉన్నాయి.. నిందితులు అందరిపై చర్యలు ఉంటాయి.. ఇప్పటికే కేసులు పెట్టాం.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తాం : హోంమంత్రి వంగలపూడి అనిత












