తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన సంచలన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రయత్నాల గురించి స్పందించిన ఆయన… అటువంటి ఊహాగానాలకు తావే లేదని స్పష్టం చేశారు. “తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ కొనసాగుతుందని తెలిపారు. తమ పార్టీ లోనూ కలవదని స్పష్టం చేశారు. ప్రజలే తమ బలమన్న కేటీఆర్.. తాము స్వయంప్రతిష్టతో కూడిన పార్టీ, మేం ఎవరి జేబులోకి వెళ్లే స్థాయిలో లేము అని బహిరంగంగా ప్రకటించారు.
కరోనా లాంటి మహామ్మారి సమయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపకుండా ముందుకు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. “దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లు, ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన పరిస్థితుల్లోనూ మేము రైతుకు rythu bandhu ఇచ్చాం. రైతు భరోసా కొనసాగించాం. కాలానికి తగిన విధంగా పాలసీలు రూపొందించామన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి బాగా దిగజారిందని.. రైతుకు ఎరువు దొరకక పోతే, బతుకే ప్రశ్నార్థకమవుతుందన్నారు. పరిస్థితులు చూస్తే పాలిచ్చే బర్రెను వదిలేసి, దున్నపోతును తలుపులు తట్టించుకున్నట్టు ఉంది అంటూ చురకలు వేశారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వ తీరుపై కూడా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు, వాళ్లే పాలించాలి. కానీ పాలన అనేది ఒక బాధ్యత, అది నాణ్యతతో నడవాలి. అభివృద్ధిని ఆపేసి, పాత రాజకీయం తెచ్చి రాష్ట్రాన్ని వెనక్కి లాగుతున్నారని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ సర్ సీఎం అయిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి పనులు మళ్లీ మొదలవుతాయని పేర్కొన్నారు.. అప్పుడే మళ్లీ సంక్షేమం కనిపిస్తుందని తెలిపారు. అప్పుడే మళ్లీ రైతు హాయిగా నిద్రపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు.