బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ టాలెంట్ గురించి తెలిసిందే. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి సూపర్ స్టార్ మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ అప్పటి నుంచి తన టాలెంట్ చూపిస్తూ వచ్చింది. బాలీవుడ్ లో తనని చూసి హేళన చేసిన వారిని మళ్లీ తన గురించి పొగిడేలా చేసుకుంది అమ్మడు. కృషి, పట్టుదల ఉంది కాబట్టే కృతి సనన్ కెరీర్ అప్ అండ్ డౌన్స్ అన్నిటినీ తట్టుకుంటూ వస్తుంది. ఐతే ఆదిపురుష్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేసినా సరే అది వర్క్ అవుట్ కాలేదు.
లాస్ట్ ఇయర్ క్రూ, దూ పట్టి ఇంకా మరో సినిమా చేసింది. ఐతే కృతి సనన్ కెరీర్ ఒకప్పటిలా దూకుడుగా లేదని అర్థమవుతుంది. ప్రస్తుతం అమ్మడు తెర ఇష్క్ మైన్ సినిమా చేస్తుంది. ఆ సినిమా టీజర్ తోనే సినిమాపై ఒక రేంజ్ అంచనాలు పెంచారు. ఐతే సినిమాల విషయాల్లో వెనకపడినా సరే వాణిజ్య ప్రకటనల్లో మాత్రం అమ్మడు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఐపిఎల్ సీజన్ అయ్యే సరికి ఓవర్ ఓవర్ కి మధ్యలో ఏదో ఒక యాడ్ లో కృతి సనన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడు మోటరోలా తో పాటుగా లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ కంపెనీకి బ్రాండింగ్ చేస్తుంది. ఇవి రెండే కాదు మరో బ్రాండ్ కి అంబాసిడర్ గా ఉంటుంది. ఐపీఎల్ సీజన్ లో ఏ భాషలో మ్యాచ్ చూసినా అందరికీ కృతి సనన్ యాడ్ మాత్రం దర్శనమిచ్చింది. కృతి సనన్ కూడా సినిమాల గ్యాప్ లో ఇలా తనకు ఇష్టమైన మోడలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంది.
కెరీర్ విషయంలో పెద్దగా పట్టింపులు ఏమి లేనట్టు కనిపిస్తున్న కృతి సనన్ తన దాకా వచ్చిన ఏ అవకాశాన్ని వదలకూడదని ఫిక్స్ అయ్యింది. తెలుగులో కెరీర్ మొదట్లోనే 1 నేనొక్కడినే, దోచెయ్ సినిమాలు చేసిన కృతి సనన్ మళ్లీ ఇటు వైపు రావాలన్న ఆలోచన లేదన్నట్టుగా కనిపిస్తుంది. కృతి సనన్ సినిమాలు ఎలా ఉన్నా యాడ్స్ లో ఆమె ఆడియన్స్ ని అలరిస్తుంది. ఐతే యాడ్స్ ఎన్ని చేసినా సినిమాల రేంజ్ సినిమాలే కాబట్టి కృతి సనన్ మళ్లీ తెర మీద మంచి పాత్రల్లో ప్రేక్షకులను అలరించాలని కోరుతున్నారు ఆమె ఫ్యాన్స్.