ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి తెలుగులో చివరగా శర్వానంద్ తో మనమే సినిమా చేసింది. ఆ సినిమా కూడా అమ్మడిని హిట్ ట్రాక్ లోకి తెస్తుందని ఆశించగా అది మిస్ ఫైర్ అయ్యింది. సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్లింది. ఐతే తెలుగులో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఇక్కడ టాప్ హీరోయిన్ గా కొన్నాళ్లు కెరీర్ సాగిస్తుందని అనుకున్నారు. ఉప్పెన, శ్యాం సింగ రాయ్, బంగార్రాజు ఈ 3 సినిమాలతో సక్సెస్ అందుకున్న కృతి ఆ తర్వాత హిట్ అన్న మాటకి దూరమైంది.
వరుస సినిమాలు చేసినా అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి రాలేదు. తెలుగులో ఇక కుదరదని ఫిక్సై తమిళ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది కృతి శెట్టి అక్కడ తను చేస్తున్న రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక మలయాళంలో కూడా కృతి శెట్టి ఏ.ఆర్.ఎం చేసినా అది అక్కడ పర్వాలేదు అనిపించుకుంది కానీ మిగతా భాషల్లో సరిగా ఆడలేదు. సినిమాలు లేక అమ్మడు ఈమధ్య ఎక్కువగా ఫోటో షూట్స్ మీద పడింది. మొదట్లో గ్లామర్ షో విషయంలో కాస్త మొహమాట పడిన బేబమ్మ ఇప్పుడు స్లీవ్ లెస్ ఫోజులతో కిక్ ఎక్కిస్తుంది. తెలుగులో ఆఫర్లు రాకపోయినా సరే కృతి శెట్టి తెలుగు పరిశ్రమ మీద ఆశలు వదులు కోవట్లేదు. ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి చిన్న ఛాన్స్ అయినా రాకపోతుందా అన్నట్టుగా ఎదురుచూస్తుంది.
ఉప్పెనతో యూత్ ఆడియన్స్ లో ఒక క్రేజ్ ఏర్పరచుకున్న కృతి శెట్టి తను తర్వాత చేసిన సినిమాల్లో ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల ఆమె వెనకబడింది. ఐతే కృతి శెట్టి తిరిగి ఫాం లోకి రావాలంటే మరో ఉప్పెన లాంటి సినిమా పడాలి. అలాంటి సినిమా కోసమే అమ్మడు ఎదురుచూస్తుంది. ఆ రేంజ్ హిట్ సినిమా ఒకటి పడితే మాత్రం మళ్లీ కృతి శెట్టి కెరీర్ గాడిన పడే అవకాశం ఉంటుంది. మరి అలాంటి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కృతి శెట్టి తమిళ్ లో చేస్తున్న జినీ, ఎల్.ఐ.కె సినిమాలు సక్సెస్ అయితే మాత్రం అమ్మడు అక్కడ కాస్త బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబమ్మని మళ్లీ తిరిగి ఫాంలో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నా అలాంటి సినిమా ఒకటి పడితే కానీ అది సాధ్యపడదని తెలుస్తుంది.