కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కృతి శెట్టి తొలిసారి.. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలో చేసిన ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో బేబమ్మ పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది కృతి శెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 100కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది. ఇద్దరికీ ఇది తొలి చిత్రమైనా.. తమ నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి చిత్రాలు చేసి హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది కృతి శెట్టి. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు లభించాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయింది. అందులో భాగంగానే వరుస పరాజయాలు తలుపు తట్టడంతో కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమైంది ఇప్పుడిప్పుడే మళ్లీ తనను తాను కం బ్యాక్ చేసుకోవాలని చూస్తున్న కృతి శెట్టి.. ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
మొదట్లో పద్ధతిగా కనిపించి, ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచిన ఈమె తన అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఏకంగా చీరకట్టుతోనే చూసే ఆడియన్స్ కు చెమటలు పట్టించేసింది కృతి శెట్టి. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి అభిమానులు ఇన్ని రోజులు ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. శారీ విషయానికి వస్తే.. ఎంబ్రాయిడరీ నెట్టెడ్ లైట్ ఆరెంజ్ కలర్ తో డిజైన్ చేసిన చీరను కట్టుకొని , అందుకు కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. ఫ్రంట్ డీప్ వీ నెక్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ లో తన ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా జుట్టును వదులుగా వదిలేసి సింపుల్ జువెలరీ తో తన మేకోవర్ ను ఫినిష్ చేసింది. ఇందులో నడుము, ఎద అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు, అటు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. పైగా ఈ ఫోటోలకు దేశి గర్ల్ వైబ్స్ అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.
ముఖ్యంగా ఈమె అందాలను చూసి ఏఐ జనరేటర్ లాగా ఉంది అని కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది లవ్, ఫైర్, స్మైల్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఇంకొంతమంది నువ్వే నా జాన్ అని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ ప్రేమను ఒలకబోస్తూ కృతి శెట్టి ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కృతి శెట్టి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తోంది.