దక్షిణ భారతదేశ రాష్ట్రంగా పిలవబడే కేరళలో అతిపెద్ద పండుగగా పేరు సొంతం చేసుకుంది ఓనం. మలయాళ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన చింగం (ఆగస్టు- సెప్టెంబర్)లో ఈ పండుగ వస్తుంది. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్ర యుక్త రోజున ఓనం లేదా తిరువోణం పేరిట ఈ పండుగను జరుపుకుంటారు. కేరళలో దాదాపు పది రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ముఖ్యంగా కేరళ ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఈ ఫెస్టివల్లో పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందాలు, కైకొట్టికలి నృత్యం మొదలైనవన్నీ ఈ పండుగ ప్రత్యేకమని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక వ్యవసాయ పండుగ అని చెప్పవచ్చు.
అలాంటి ఈ ఓనం పండుగ ఇప్పుడు రానే వచ్చేసింది. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ ఓనం పండుగను జరుపుకుంటున్నారు. అంతేకాదు ఈ పండుగ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. తమ ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక అందరిలాగే కీర్తి సురేష్ కూడా వివాహం తర్వాత తన భర్తతో కలిసి మొదటి ఓనం సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ ఫోటోలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో సాంప్రదాయమైన తెల్లటి చీర, గోల్డెన్ కలర్ బార్డర్ కలిగిన కేరళ సాంప్రదాయ చీరను ధరించింది. ఈ చీరపై పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ తో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈమె భర్త కూడా పట్టు పంచె , చొక్కా ధరించి తన అందాన్ని ఎలివేట్ చేశారు. ఇక స్టైలిష్ గా కూలింగ్ గ్లాసు పెట్టుకొని మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ జంట.
ఇకపోతే ఇక్కడ మరో హైలెట్ గా నిలిచిన అంశం ఏమిటంటే.. కీర్తి సురేష్ తన పెట్ డాగ్స్ కి కూడా ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా సాంప్రదాయ దుస్తులు వేసింది. ఇక ఈ ఫెస్టివల్ లో ఈ పెట్ డాగ్స్ మరింత అట్రాక్షన్ గా నిలిచాయి అని చెప్పవచ్చు..మొత్తానికైతే వివాహం తర్వాత తమ నివాసంలో జరుపుకున్న తొలి ఓనం కావడంతో కీర్తి సురేష్ తన ఆనందాన్ని ఇటు అభిమానులతో కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ను 2024 డిసెంబర్ 12న గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్. 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఈ జంట ఎట్టకేలకు గత ఏడాది వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కెరియర్ మొదలు పెట్టిన కీర్తి సురేష్.. ప్రముఖ మలయాళ నిర్మాత జి.సురేష్ కుమార్, ప్రముఖ నటి మేనక ల కుమార్తె. 2000 సంవత్సరంలోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. 2013లో విడుదలైన ‘గీతాంజలి’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇప్పుడు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ మొదటి సినిమానే డిజాస్టర్ గా నిలిచింది.
@KeerthyOfficial
keetu papa ni ila choodagaane thammudu ala nilchunnadu, that’s d power of her. #Onam #KeerthySuresh pic.twitter.com/CgRtbuaw8j— news7telugu (@news7telug2024) September 6, 2025