మహానటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కాస్త సినిమాల విషయంలో దూకుడు తగ్గించిందని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ ఫాం కొనసాగిస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూసింది. బేబీ జాన్ సినిమాతో అక్కడ తొలి ప్రయత్నం చేసింది కీర్తి సురేష్. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది ఫ్లాప్ అవ్వడంతో మరో బాలీవుడ్ ఆఫర్ రాలేదు. ఇక సౌత్ లో మాత్రం కెర్తి సురేష్ ఫాం కొనసాగిస్తుంది.
ప్రెజెంట్ అమ్మడు నటించిన రివాల్వర్ రీటా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఆగష్టు 27న ఈ సినిమా రిలీజ్ అని టాక్. ఐతే ఈ సినిమా ఎప్పుడో పూర్తి కాగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూశారు మేకర్స్. ఫైనల్ గా ఆగష్టు 27న ఈ సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా తెలుగులో రివాల్వర్ రాణిగా టైటిల్ పోస్టర్ ఇంకా టీజర్ కూడా వదిలారు. కానీ తెలుగు రిలీజ్ పై ఎవరు చప్పుడు చేయట్లేదు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ తో ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది. మిస్కిన్ ఇప్పటికే కీర్తి సురేష్ ని కలిసి కథ చెప్పడం ఆమె ఇంట్రెస్ట్ చూపించడం జరిగిందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఐతే తెలుగులో కీర్తి సురేష్ ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ సినిమాలు సైన్ చేసింది.
ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ మీదకు వెళ్తున్నాయి. ఈ రెండు దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. నానితో దసరా చేసి హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత రెండేళ్ల క్రితం చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేసింది. ఆ సినిమాలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేసింది. ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో కీర్తికి మళ్లీ ఛాన్స్ లు రాలేదు. ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న రెండు సినిమాల్లో నటిస్తుంది అమ్మడు. కీర్తి సురేష్ కంబ్యాక్ కోసం తెలుగు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆమె ఇక్కడ సినిమాలు చేయడమే కాదు ఇక్కడ సక్సెస్ ఫాం కొనసాగించాలని కోరుతున్నారు. తమిళ్ లో కూడా కీర్తి కెరీర్ అంత దూకుడుగా ఏమి లేదు. కొత్త హీరోయిన్స్ రావడంతో కీర్తి సురేష్ మీద అంత ఆసక్తి చూపించట్లేదు తమిళ మేకర్స్. అందుకే తెలుగులో ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ తో సత్తా చాటాలని చూస్తుంది కీర్తి సురేష్.
Vibe with Kee@KeerthyOfficial
💚📷#KeerthySuresh #Keerthy #Ak64 pic.twitter.com/nxThJueal5— news7telugu (@news7telug2024) August 21, 2025