మహానటి ఫేం కీర్తి సురేష్ కెరీర్ ఆరంభం నుంచి స్కిన్ షో కి దూరంగా ఉంటూ వచ్చింది. ముఖ్యంగా సినిమాల్లో అడుగు పెట్టిన కొన్ని సంవత్సరాల పాటు కనీసం నడుము అందాన్ని కూడా చూపించకుండా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. కీర్తి సురేష్ కేవలం నటనతో గుర్తింపు దక్కించుకుంటుంది, అందాల ఆరబోత చేయకుండానే ఇంతటి పాపులారిటీని సొంతం చేసుకుంటే ఇక స్కిన్ షో చేస్తే ఏ స్థాయిలో ఈమె స్టార్‌డం దక్కించుకుంటుందో కదా అంటూ చాలా మంది కామెంట్ చేశారు. చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించినా కూడా కీర్తి సురేష్ కెరీర్ ఆరంభంలో స్కిన్ షోకి ఓకే చెప్పలేదు. ఏ ఒక్క సినిమాలో కనీసం చిన్న రొమాంటిక్ సీన్స్‌లో కూడా ఈమె నటించలేదు.
స్కిన్ షోకి, రొమాంటిక్ సీన్స్‌కి దూరంగా ఉండటం వల్ల టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గాయి, కోలీవుడ్‌లోనూ ఈమెకు స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కడం లేదు. దాంతో మెల్ల మెల్లగా తాను కూడా రూట్ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే స్కిన్ షో కి ఈ అమ్మడు రెడీ అయింది. ఆ మధ్య మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో ఒక మోస్తరు స్కిన్ షో చేసింది. అంతే కాకుండా ఆ సినిమాలో కాస్త మహేష్ బాబుతో రొమాంటిక్ యాంగిల్ ఉన్న పాత్రలో కనిపించింది. కీర్తి సురేష్‌ను ఆ సినిమాలో చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఇక బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాబీ జాన్ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. రొమాంటిక్ సీన్స్, స్కిన్ షోకి ఈ అమ్మడు దాదాపుగా ఓకే చెప్పినట్లే అని దాంతో క్లారిటీ ఇచ్చింది.
సౌత్ ఇండియాలోనే కాకుండా ఎక్కడైనా సినిమాల్లో హీరోయిన్స్ అలరించాలంటే ఖచ్చితంగా స్కిన్ షో చేయాల్సిందే, స్టార్ డం దక్కాలంటే రొమాంటిక్ సీన్స్ చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ కామన్ అయ్యాయి. అందుకే చాలా మంది హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్‌కు ఇష్టం లేకున్నా ఓకే చెబుతున్నారు. ఆఫర్లు రావాలంటే కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు ఉండాలని, అన్నింటికి ఓకే చెప్పాలని కొందరు హీరోయిన్స్ అంటూ ఉంటారు. అలా ఉంటేనే ఇండస్ట్రీలో ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయని అంటారు. కీర్తి మాత్రం అందంగా కనిపించే విషయంలో హద్దులు దాటింది కానీ ముద్దు విషయంలో మాత్రం శృతి మించను అంటోంది.
ఒక మోస్తరు వరకు స్కిన్ షో చేయడానికి ఈ అమ్మడు రెడీ అంటోంది. ఇప్పటి వరకు చేసిన దానితో పోల్చితే కీర్తి సురేష్‌ను ఇంకాస్త ఎక్కువగానే స్కిన్ షో లో చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ రొమాంటిక్ సీన్స్ ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్‌లో ఆమెను చూసే అవకాశం లేదని అంటున్నారు. పెళ్లి తర్వాత సహజంగా హీరోయిన్స్ స్కిన్ షో కి దూరంగా ఉంటారు. కానీ కీర్తి సురేష్ ఇన్నాళ్లు స్కిన్ షో చేయకుడా ఉండి, పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు స్కిన్ షోకు ఓకే చెప్పడం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. త్వరలో ఈమె తెలుగులో విజయ్ దేవరకొండతో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు తమిళ్, హిందీలోనూ ఈమె ప్రాజెక్ట్‌లు చేస్తూనే ఉంది.