ఇద్దరు పిల్లలకు మామ్ కరీనా కపూర్ ఖాన్. వయసు 44.. కానీ ఇంకా మనసు 24లోనే ఆగింది! ఎప్పటికీ ఏజ్ లెస్ బ్యూటీగా యువతరం హృదయాలను గెలుచుకుంటున్నారు. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం జీరో సైజ్ లుక్ తో అలరించిన బెబోకి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. బికినీ వేర్ స్విమ్ సూట్లతో సెలబ్రేషన్ కి ఎప్పుడూ అబ్జెక్ట్ చేయని బెబో ఇప్పుడు మరోసారి తనదైన సిగ్నేచర్ మార్క్ స్విమ్ సూట్ తో గుబులు రేపింది.
ఈత దుస్తుల్లో కరీనా లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. లేత గోధుమరంగు బ్లాక్ కలర్ మిక్స్ డ్ స్విమ్‌సూట్‌లో కరీనా యూనిక్ గా కనిపిస్తోంది. బీచ్ ఇసుకలో ఈ సీనియర్ బ్యూటీ ఫోజులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ కొత్త లుక్ పై అభిమానులు ఫైర్ ఈమోజీలను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బెబో తగ్గేదేలే! అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. ముఖ్యంగా కరీనా సహజసిద్ధమైన అందచందాలకు ముగ్ధులైపోతున్నామని చెబుతున్నారు. ఈ వెకేషన్ లో కరీనా భర్త సైఫ్, పిల్లలు కూడా ఉన్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే… కరీనా చివరిగా `క్రూ`లో నటించింది. కృతి సనన్, టబులతో పోటీపడుతూ చిలిపి అమ్మాయిగా కనిపించింది. రోహిత్ శెట్టి `సింగం ఎగైన్`లోను ఛాలెంజింగ్ పాత్రలో కనిపించింది. తదుపరి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న `దాయ్రా`లో కనిపిస్తుంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్ షో `డైనింగ్ విత్ ది కపూర్స్`లో కూడా కనిపిస్తుంది. బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యామిలీస్ నుంచి చాలా సంఘటనలపై ఫిల్టర్ లెట్ విషయాలను ఈ షోలో కరీనా చర్చించనుంది.