బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆమె వార్తల్లోనే ఉంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారుతుంటారు. రీసెంట్ గా బాలీవుడ్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అసలు బీటౌన్ లో మర్యాద ఇవ్వరని తీవ్రంగా ఆరోపించారు.
అయితే కంగనా రనౌత్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటోంది. పలువురితో ఆమె ప్రేమాయణం నడిపిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అది కూడా వివాహేతర సంబంధాలు అని పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. సదరు వ్యక్తులకు అప్పటికే పెళ్లిళ్లు అయినా, కంగన రిలేషన్ షిప్ లో కొన్నాళ్లు ఉన్నారని వినికిడి.
తొలుత జరీనా వహాబ్ ను వివాహం చేసుకున్న నటుడు ఆదిత్య పంచోలితో కంగనకు సంబంధం ఉండేదని కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అప్పటికి ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో డేటింగ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఆయనకు కూడా పెళ్లి అయ్యి ఇద్దరు కుమారులు కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో కంగన.. వ్యక్తిగత జీవితం విషయంలో తరచూ విమర్శలు, ట్రోలింగ్స్ ఎదుర్కొంటూనే ఉంటారు. పెళ్లి అయ్యి.. పిల్లలు ఉన్నా.. అలా చేశారని ఆరోపిస్తూ ట్రోల్ చేస్తుంటారు కొందరు నెటిజన్లు. అందుకే కంగన వ్యక్తిగత జీవితం.. ఆమె వృత్తిపరమైన ప్రయాణం లాగానే.. ఎప్పుడూ హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది.
అదే సమయంలో కొద్ది రోజుల క్రితం ఆమె ప్రేమ- పెళ్లి కోసం మాట్లాడగా.. ఆ కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తెలిసీ తెలియని వయసులో తాను ప్రేమలో పడ్డానని కొద్ది రోజుల క్రితం తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల అది బ్రేకప్ అయినా దాని వల్ల తనకు మంచే జరిగిందని చెప్పుకొచ్చారు కంగనా రనౌత్.
లవ్ ఫెయిల్యూర్ వల్ల జరిగే మంచి చాలామందికి ఆలస్యంగా తెలుస్తుందని అన్నారు. పెళ్లి, ఫ్యామిలీ గురించి ప్రతి అమ్మాయి కలలు కంటుందని తెలిపారు. కుటుంబ వ్యవస్థకు గౌరవం ఇస్తానని, మరి కొన్నేళ్లలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితే చేసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారో చూడాలి.