‘కాళేశ్వరం’ (Kaleshwaram) అవినీతి అంశంపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు సీబీఐ (CBI) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ (Praveen Sood) ఇవాళ హైదరాబాద్ (Hyderabad)కు వచ్చారు. కోఠీలోని సీబీఐ బ్రాంచ్ ఆఫీసులో అధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారణ నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా హైదరాబాద్‌కు ప్రధాన్యతను సంతరించుకుంది. కాగా, కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయం విదితమే.
NDSA రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం కార్పొరేషన్ (Kaleshwaram Corporation), అంతరాష్ట్ర అంశాలపై విచారించాలని ప్రతిపాదనలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలని లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టుల డిజైన్, క్వాలీటీ, లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని NDSA రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. ప్రజాప్రతినిధుతో పాటు ప్రాజెక్టులలో భాగస్వాములైన కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని సీబీఐకి రాసిన లేఖలో తెలంగాణ సర్కార్ కోరింది.
ఎవరీ ప్రవీణ్ సూద్..?
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం కర్ణాటక డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రవీణ్ సూద్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు కొత్త డైరెక్టర్‌గా నియమితులై 25 మే 2023న బాధ్యతలు స్వీకరించారు. మరో రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. సుబోధ్ జైస్వాల్ తర్వాత దేశంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ కావడం విశేషం.
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ సాధించి..
ప్రవీణ్ సూద్ 1964లో హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించారు. ఆయన తండ్రి, దివంగత ఓం ప్రకాష్ సూద్ ఢిల్లీలో ఓ ప్రభుత్వ గుమాస్తా పనిచేసేవారు. ఆయన తల్లి దివంగత కమలేష్ సూద్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ప్రవీణ్ పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి అక్కడే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ప్రవీణ్ సూద్ యూపీఎస్సీ (సివిల్స్) పరీక్షలో ర్యాంక్ సాధించారు. 1989లో మైసూరులో తొలి పోస్టింగ్ పొందారు. అక్కడ ఆయన వినూత్నమైన, నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు పొందాడు.
ప్రవీణ్ సూద్ 1999లో మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా మూడేళ్లు అక్కడే విధులు నిర్వర్తించారు. ఆ తరువాత మైసూర్ పోలీస్ కమిషనర్ 2004 నుంచి 2007 వరకు పనిచేశారు. 2008, 2011లో బెంగళూరు కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంప్యూటర్ వింగ్‌కు అధిపతిగా ఉన్నారు. అదేవిధంగా 2013 నుండి 2014 వరకు కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగారు. అనంతరం కర్ణాటక హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆ రాష్ట్ర డీజీపీగా పనిచేసిన అనుభవం ప్రవీన్ సూద్ సొంతం.