టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఏలిన కాజల్ అగర్వాల్ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన మనసుకు నచ్చిన స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన సంగతి తెలిసిందే. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుతో కాజల్ అన్యోన్య దాంపత్యం అభిమానుల్లో నిరంతరం హాట్ టాపిక్. ఇక ఈ జంటకు నీల్ కిచ్లు అనే ఒక చిన్నారి ఉన్న సంగతి తెలిసిందే.
తన భర్త గౌతమ్ కిచ్లుతో పాటు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహార యాత్రను ఆస్వాధిస్తోంది కాజల్. ఇటీవల ఐదో వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా షూటింగులకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ, వెకేషన్ ని ఎంజాయ్ చేయడంలో నిమగ్నమైంది. తాజాగా ఆస్ట్రేలియాలోని సుందరమైన యారా వ్యాలీ నుంచి కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా వీటిని పరిశీలిస్తున్నారు.
ఈ విహార యాత్రలో కాజల్ అగర్వాల్ సింపుల్ డ్రెస్ లలో కనిపించింది. యాత్రను మనసారా ఆస్వాధిస్తోందని తన ఫోటోలు చూశాక అర్థం చేసుకోవచ్చు. కాజల్ – కిచ్లు దంపతులు ఈ విహార యాత్ర కోసం ఓ ప్రయివేట్ జెట్ ని ఉపయోగించారని కూడా ఫోటోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలోని ఎగ్జోటిక్ లొకేషన్లలో కాజల్ ఫోటోషూట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.
వినోద రంగంలో మేటి కథానాయికలుగా ఏలిన చాలా మంది తమ వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఆశించినది సాధించుకోలేకపోయారు. చాలా మందితో పోలిస్తే, అగ్ర నాయిక హోదాను ఆస్వాధించిన కాజల్ తన భర్త పిల్లలతో వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని తెలివిగా మ్యానేజ్ చేస్తూ సహచరులకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం భర్త పిల్లలతోనే కాదు.. తన సోదరి నిషా అగర్వాల్ తోను కలిసి ఉన్న చాలా ఫోటోలను కాజల్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. నిషా అగర్వాల్ తో కలిసి బీచ్ లో సెలబ్రేషన్ మోడ్ లో ఉన్న ఫోటోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి.
కాజల్ అగర్వాల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే, ప్రస్తుతం మలయాళంలో `ఐ యామ్ గేమ్` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ: పార్ట్ -1లో మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించనుంది. రామాయణ: పార్ట్ 2 లోను ఈ పాత్ర కొనసాగుతుంది. ఇక శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 నిరాశపరిచినా కానీ, భారతీయుడు- 3 సెట్స్ పైకి వెళుతుందని శంకర్ ప్రకటించారు. ఒకవేళ ఇదే నిజమైతే కాజల్ అగర్వాల్ ఈ సీక్వెల్ చిత్రంలోను నటించాల్సి ఉంటుంది.


















