మంజులు ఘట్టమనేని, సూపర్ స్టార్ మహేష్ మేనకోడలు జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జాన్వీ ఫోటోలు కూడా లీక్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారాయి. జాన్వీ పక్కా హీరోయిన్ మెటీరియల్. సరైన సినిమాలు పడితే? స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టదు. ఎలాగూ ఇండస్ట్రీ బిడ్డ కాబట్టి? లాంచింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందం, అభినయం గల నాయిక కావడంతో? దర్శక, నిర్మాతలు సినిమాలు నిర్మించడానికి ముందుకొస్తారు. ఇప్పటికే నటన, డాన్సింగ్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకొంది. కొన్ని కథలు కూడా రెడీ అయ్యాయి.
డెబ్యూ సినిమాపై సంతకాలు కూడా పెట్టేసింది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. అయితే జాన్వీకి జోడీ ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఘట్టమనేని కుటుంబం నుంచి ఓ నటి వస్తుందంటే అంచనాలు సహజం. ఈ నేపథ్యంలో ఆమెకు జోడీగా ఏ హీరో నటిస్తాడు? అన్నది దానిపై ఆసక్తి నెలకొంది. ఆ హీరో కూడా పేరున్న నటుడై ఉండాలి. లేదా? ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటుడైనా అయి ఉండాలి. ఆ హీరో ఎవరు? అన్నది ఇప్పటికే ఫిక్సైంది. కానీ రివీల్ చేయలేదు. అలాగే దర్శక, నిర్మాతలు ఎవరు? అన్నది కూడా వెల్లడించలేదు.
ప్రత్యేకించి హీరో విషయంలో ఘట్టమనేని కుటుంబం చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో మంజుల హీరోయిన్ అవుతున్నారంటే? సూపర్ స్టార్ అభిమానుల నుంచి అసంతృప్తి గళం వినిపించింది. తమ అభిమాన హీరో కుమార్తెను హీరోయిన్ గా చూడలేమని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. దీంతో కృష్ణ వెనకడుగు వేసారు. ఆ తర్వాత మంజుల హీరోయిన్ ఛాన్సులు వదులుకుని కీలక పాత్రల వైపు అడుగులు వేసి కొన్ని సినిమాలు చేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. నిర్మాతగానూ కొంత కాలం కొనసాగారు. ఈ పరిస్థితులన్నింటిని మంజుల దృష్టిలో పెట్టుకునే ఉంటారు. కుమార్తె విషయంలో అభిమానుల నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే తుది నిర్ణయాలు తీసుకుని ఉంటారు. అయితే అప్పటికీ ఇప్పటికీ అభిమానుల్లో చాలా మార్పులొచ్చాయి. వాస్తవాన్ని గ్రహించగల్గుతున్నారు. సినిమాలు చూసే విధానంలోనూ మార్పులొచ్చాయి. కాబట్టి విమర్శలకు పెద్దగా అవకాశం ఉండకపోవొచ్చు.



















