బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎప్పుడూ తన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పింక్ రెడ్ షేడ్స్ కలిగిన ఫ్లోరల్ డ్రెస్‌లో జన్వి సంప్రదాయాన్నీ, మోడ్రన్ టచ్‌ని కలిపి ఒక కొత్త గ్లామర్ వేవ్‌ని చూపించింది. చేతిలో ఒక తెల్లని పువ్వుని పట్టుకుని చిరునవ్వులు చిందించడం, జతగా వెండి గాజులు, జుమ్కాలు జోడించడం వల్ల ఈ లుక్‌కి సింపుల్‌గా ఒక ప్రత్యేకమైన అందం వచ్చింది.
ఈ ఫోటోలు పోస్ట్ చేసిన వెంటనే అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. “గార్డెన్‌లో పూల కంటే నువ్వే అందంగా ఉన్నావు,” “కలర్స్ కంటే నీ చిరునవ్వు బ్రైట్‌గా ఉంది,” అంటూ కామెంట్లు కురిపించారు. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ సాధించడంతో జాన్వి క్రేజ్ ఎలా ఉందో మరోసారి రుజువైంది. ఈ ఫోటోషూట్ ఆమె ఫ్యాషన్ గేమ్‌లోని ప్రయోగాత్మక ట్రెండ్ ను మళ్లీ హైలైట్ చేస్తోంది.
కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ 2018లో ‘ధడక్’ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ వంటి చిత్రాలతో తన నటనను నిరూపించుకుంది. ఇటీవల దక్షిణాదికి కూడా అడుగుపెట్టి దేవరలో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. ఇక రామ్ చరణ్ సరసన తన రెండో తెలుగు సినిమా ‘పెద్ది’ చేస్తోంది.
అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా జోడీగా ‘పరం సుందరి’లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులు ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో మంచి అవకాశాలను తెస్తున్నాయి. సినిమాలతో పాటు జాన్వీ ఫ్యాషన్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఎప్పుడూ కొత్త స్టైల్‌ను ప్రయత్నించడానికి వెనుకాడని ఆమె, సాంప్రదాయ దుస్తుల్లోనూ, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లోనూ సమానంగా మెరిసిపోతుంది. ఈ ఫ్లోరల్ డ్రెస్సింగ్ లుక్ ద్వారా ఆమె మరోసారి ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇక జాన్వీ కెరీర్ ఇప్పుడు ఒక క్రిటికల్ ఫేజ్‌లో ఉంది. మంచి కథలతో పాటు తన గ్లామరస్ ఇమేజ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తూ, స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Jaanu Papa Flaunting for #ParamSundari📷 #JanhviKapoor@news7telug2024 pic.twitter.com/MEGaZaLQrH
— news7telugu (@news7telug2024) August 16, 2025