ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి అటు అసెంబ్లీలో , బయట సభలలో కూటమిదే మరో 15 ఏళ్లు అధికారమంటూ పదే పదే పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు. 15 ఏళ్ల తర్వాత జనసేన పార్టీ పరిస్థితి ఏంటి?. వాస్తవంగా సీఎం చంద్రబాబు వయసు ప్రస్తుతం 75 ఏళ్లు.. మరో 15 ఏళ్లు సీఎంగా చంద్రబాబు కొనసాగితే ఆయనకు 90 ఏళ్ళు వస్తాయి. అయితే అప్పటివరకు సీఎంగా చంద్రబాబు ఉంటారా? లేదా మధ్యలో ఎవరికైనా బదిలీ చేసే అవకాశం ఉంటుందా?
ఇప్పుడు ఏపీలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మంత్రిగా నారా లోకేష్ బాగానే యాక్టివ్గా కనిపిస్తున్నారు. అన్నిటిని తానే చూసుకుంటూ ఢిల్లీ స్థాయిలో కూడా తన పేరు వినిపించేలా చేస్తున్నారు లోకేష్. కూటమిలో కూడా మెజారిటీ వాటా మాత్రం టిడిపి పార్టీదే ఎక్కువగా ఉన్నది. జనసేన, బిజెపి పార్టీ వాటా ఒక ఇంట పదో వంతుగా ఉన్నది. 90 శాతానికి పైగా టిడిపి పార్టీకి మెజారిటీ ఉన్నది. దీన్ని బట్టి చూస్తే 15 ఏళ్లు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా కూటమి అధికారంలో ఉంటే సీఎంగా టిడిపి పార్టీ వారే అవుతారు తప్ప అందులో మెజారిటీ వాటా ఉన్న జనసేన పార్టీకు అయితే రాదు..
కూటమిలో జనసేన పార్టీ ఎమ్మెల్యేల సీట్లు పెరగాలి అంటే అసెంబ్లీ స్థానాలు పెరగాల్సి ఉంటుంది. లేకపోతే సీట్లు పెంచే అవకాశం కూడా కనిపించడం లేదు. వీటికి తోడు ఈ ఐదేళ్లపాటు జనసేన పార్టీ పనితీరుపైన గమనించిన ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనే విషయం కూడా చూడాలి. ఆంధ్ర రాజకీయాలు బాగా తెలిసిన వారికి ఏ ఒక్కరు కూడా ఈ 15 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఖచ్చితంగా అంచనా వేయలేరు.పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు, నేతలు ఎన్నో సందర్భాలలో తెలిపారు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కూటమిలో ఉంటే సీఎంగా అయ్యే అవకాశం ఎక్కడ కనిపించలేదు. కేవలం డిప్యూటీ సీఎంగా మాత్రమే కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే జాతీయ రాజకీయాలలో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే పార్టీ శ్రేణులు మెంబర్షిప్ చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదని ఇన్ సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 15 ఏళ్ల పాటు కూటమిలోనే ఉండడం అనే విషయం అటు నేతలను కార్యకర్తలను చాలా అసంతృప్తికి గురిచేస్తోందట. విశాఖలో సభ పెట్టి అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా బాగానే ఉన్నా పార్టీ శ్రేణులకు కూడా ఒక దిశా నిర్దేశమనేది ఉండాలి. ముఖ్యంగా ఫలానా సమయానికి మనం అధికారం చేపట్టాలి లేకపోతే కూటమిలో సగభాగం సీట్లను మనం చేరే స్థాయికి ఎదగాలని లక్ష్యం ఉండాలి కానీ ఇవన్నీ జనసేన పార్టీలో ఎక్కడ కనిపించడం లేదు. కేవలం 15 ఏళ్లు కూటమిలో ఉంటాం అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నారు పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.