జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇటీవల విశాఖలో జరిగిన `సేనతో సేనాని` కార్యక్రమంలో `త్రిశూల్` అనే కొత్త విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ త్రిశూల్‌కు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. పార్టీకి.. ముఖ్యంగా వచ్చే 10 సంవత్సరాల భవితవ్యానికి కూడా ఈ త్రిశూల్ కీలకమని వెల్లడించారు. మెరికల్లాంటి యువతను పార్టీలోకి తీసుకుని.. వారిని బలమైన నాయకులుగా ఎదిగేలా చేస్తామని చెప్పారు.
సైద్ధాంతిక నిబద్ధత: జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలపై యువతకు ముందుగా శిక్షణ ఇస్తా రు. అదేవిధంగా ప్రజల సమస్యలు, పార్టీకి సంబంధించి అంశాలపై చర్చిస్తారు. వారిలో సేవా తత్పరతను ప్రోది చేస్తారు. బలమైన ఆకాంక్షను పెంచుతారు. తద్వారా పార్టీ తరఫున ప్రజల మధ్యకు వెళ్లేందుకు వారి లో స్ఫూర్తిని రగిలిస్తారు. నాయకత్వ లక్షణాలు: తొలుత సైద్ధాంతిక పునాదులు బలోపేతం చేయడం ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా చేస్తారు.
పార్టీలో కీలక పోస్టులు: ఇలా.. రెండు రూపాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చిన అనంతరం.. వారిని పార్టీలో ప్రధాన కార్యదర్శులుగా నియమించే దిశగా ఆలోచన చేస్తున్నారు. తర్వాత.. వీరికి కీలక బాధ్యతలను కూ డా అప్పగిస్తారు. ఇలా మూడు రూపాల్లో బలమైన శిక్షణను ఇచ్చి.. మెరికల్లాంటి నాయకులను రూపొందిం చేందుకు పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఐఐటీ మద్రాస్ నిపుణులతో సంప్రదింపులు జరుపు తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్యక్రమానికి ఒక రూపం తీసుకువచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.