జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత మీద పూర్తి ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఆయన మరో రెండు సినిమాల తరువాత పూర్తిగా ఆ వైపు చూడరని అంటున్నారు. తన కమిట్మెంట్స్ అన్నీ కూడా ఆయన దాదాపుగా పూర్తి చేశారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో పార్టీని బలోపేతం చేయడం మీదనే పవన్ పూర్తిగా దృష్టి పెడతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నారు.
ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తోంది మంచి ముహూర్తాలే ఉన్నాయి. దాంతో పవన్ ఆగస్టు నెలలో పార్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఆయన పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు ఎమ్మెల్యేల పనితీరు వంటి వాటి మీద సమీక్ష చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా తన వద్ద ఉన్న సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ ఎమ్మెల్యేల పనితీరుని మధింపు చేస్తారు అని అంటున్నారు. సర్వేలలో వెనకబడిన వారికి కొంత క్లాస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇన్నాళ్ళూ పరిమిత స్థాయిలో పార్టీ పదవులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు పార్టీలో విధేయులకు పెద్ద పీట వేయనున్నారు అని అంటున్నారు. పార్టీ కోసం గడచిన పన్నెండేళ్ళుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు అని చెబుతున్నారు. అంతే కాదు నామినేటెడ్ పదవులు కూడా కష్టపడేవారికే ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇస్తే ఊపు ఉత్సాహం వస్తాయని ఆయన భావిస్తున్నారుట.
జనసేన 2014లో ప్రారంభించారు. అయితే ఆనాడు జనసేనలో ఊపు ఎంతో ఉండేది. అయితే 2024లో అధికారంలోకి వచ్చాక చాలా మంది రిలాక్స్ అయిపోయారు అని అంటున్నారు. కొంతమంది పదవులు ఉంటే చేయాలని చూస్తున్నారు. ఇక చాలా మంది ఆధిపత్య పోరు అంటూ కూటమిలో అసంతృప్తిగా ఉన్నారుట. అయితే అందరి సమస్యలను తెల్సుకుని వాటికి పరిష్కారాలు చూపించడమే కాకుండా పొత్తుల విషయంలో కానీ కో ఆర్డినేషన్ విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది పడకుండా పనిచేయాలని పవన్ సూచిస్తారు అని చెబుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే మొత్తం 20 మంది ఎమ్మెల్యేలలో 15 మంది దాకా ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తి ఉందని అంటున్నారు. వారికి సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టులు పవన్ చేతిలో ఉన్నాయని అంటున్నారు. వారికి క్లాస్ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు. రానున్న నాలుగేళ్ళ పాటు పనిచేయకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లకే ఇబ్బంది అని చెప్పనున్నారని అంటున్నారు. ఇక జనసేన బలహీనంగా ఉన్న చోట్ల పార్టీని విస్తరించాలని కూడా పవన్ డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. మొత్తానికి జనసేన అధినేత చాలా కాలానికి పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఎలాంటి సూచనలు చేస్తారో ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారో.