సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలంటే అనేక అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాస్టింక్ కౌచ్. ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆశావాహులను ఆసరాగా చేసుకొని కమింట్ మెంట్ అడిగారన్న సంఘటనలు చాలానే చూశాం. అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇలాంటివి వెంటనే పసిగట్టగలుగుతారు.
తనకు ఎదురైన ఇలాంటి ఓ సంఘటటనే పంచుకుంది ప్రముఖ నటుడు జానీ లివర్ కుమార్తె జామి. ఒకప్పుడు ఎవరో అంతర్జాతీయ చిత్రానికి దర్శకుడినని చెప్పి ఆడిషన్ పేరుతో వీడియో కాల్‌లో తనను బట్టలు విప్పమని అడిగారని చెప్పింది. ఇలాంటిది బాలీవుడ్‌లో తానెప్పుడూ ఎదుర్కోకపోకపోవడంతో అది భయంకరమైన ఘటన అని చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు పడినట్లు బయటి వ్యక్తుల నుంచి విన్నానని, తన తండ్రి ఇండస్ట్రీలో ఉడడం అదృష్టం అని చెప్పింది.
కెరీర్ ప్రారంభంలో ఆమెకు మేనేజర్ ఉండేవాడు కాదట. ఆ సమయంలో ఆమెకు ఇంటర్నేషనల్ సినిమా ఆడిషన్స్ అంటూ ఫోన్ వచ్చిందట. ఈ ఆడిషన్ కోసం ఆమెను జూమ్ వీడియో కాల్ లో సంప్రదించారట. పెద్ద సినిమా కావడంతో స్ర్కిప్ట్ ఆమెతో పంచుకోమని, అవతలి వైపు డైరెక్టర్ ఆడిషన్ చేస్తారని చెప్పారట. కానీ ఆయన వీడియో ఆన్ చేయకుండా, ఈ సినిమాలో పాత్రకు తాను సరిపోతారో లేదో పరీక్షించాలనుకుంటున్నట్లు చెప్పారని ఆమె గుర్తుచేసుకుంది. ఇదివరకులాగా కామెడీ చేయాల్సిన పని లేదని సినిమలో బోల్డ్ క్యారెక్టర్ ఉందని అన్నారు. నా ఎదురుగా 50 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు ఊహించుకొని అతడిని ఆకర్షించాలని చెప్పారు. నాకు అది వీడియో కాల్ లో సౌకర్యంగా లేదని, నిజంగా సినిమాలో సీన్ ఉంటే అప్పుడు చేస్తానని చెప్పాను. ఆ తర్వాత వాళ్లు నన్ను బట్టలు విప్పమని అడిగారు.
నేను షాకయ్యా. వెంటనే బట్టలు విప్పడం గురించి నాకు ఎవరూ చెప్పలేదు. ఇలా చేయడం నాకు సౌకర్యంగా లేదు అని అన్నాను. కానీ వాళ్లు.. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్, మేము నిజంగా మీరు ఇందులో నటించాలనుకుంటున్నాము, ఇది మీకు ఒక పెద్ద అవకాశం అని అన్నారు. కానీ నేను.. సార్, ఈ వీడియో కాల్‌లో నేను బట్టలు విప్పాలని మీరు ఆశిస్తున్నట్లయితే, ఆలా చేయడం నాకు సౌకర్యంగా లేదు. దాని గురించి నాకు ముందుగా సమాచారం ఇవ్వలేదు అని వెంటనే వీడియో కట్ చేశాను.
వీడియో కాల్ కట్ చేయగానే ఇది పెద్ద స్కామ్ కావొచ్చని అని జేమీ గ్రహించిందట. ఇది చాలా పెద్ద స్కామ్ కావచ్చు అని నేను గ్రహించాను. వాళ్ల చెప్పినట్లు చేసి ఉంటే వారు నన్ను నగ్నంగా వీడియో తీసి ఉండేవాళ్లేమో. దాంతో నన్ను బ్లాక్ మెయిల్ చేసేవారు. అని ఆమె చెప్పింది. అయితే ఆ టైమ్ లో ఆ స్కామ్ గురించి అంత తొందరగా ఆలోచించి ఫోన్ కట్ చేయడం వరం అని కూడా చెప్పింది. అలాగే ముంబైలో తనకు ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదట. అలాగే ఆమె జానీ లివర్ కూతురు అని తెలిసినప్పటికీ అలా చేయడానికి ప్రయత్నించడం అంటే చాలానే ధైర్యం చేశారని అది ఆమెను మరింత షాక్‌కు గురి చేసిందని చేప్పింది. ఇప్పటీకీ ఆ సంఘటన గురించి ఆలోచించిస్తే ఆమెకు భయంగా ఉంటుందని చెప్పింది.