వ్యక్తులకైనా.. వ్యవస్థలకైనా యాక్టివిటీ చాలా ముఖ్యం. వర్కవుట్ లేకపోతే.. ఎంత పని అయినా.. వీగిపో తుంది. నిజానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఫార్ములాతోనే ముందుకు సాగుతోంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రజల మధ్యకు వచ్చేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు వారం రోజులుగా ఉన్న ఈ లెక్కను రెండు రోజులకు కుదించుకున్నారు. వారంలో మూడు సార్లు ఖచ్చితంగా ప్రజల మధ్యకు రావాలని.. ఏదో ఒక కార్యక్రమం ద్వారా వారికి చేరువ కావాలని నిర్ణయించా రు.
తద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే.. వైసీపీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. జగన్ యాక్టివి టీని పెంచుకునే విషయంలో ఎక్కడిక్కడే ఉన్నాయి. ఆయన ప్రజల మధ్యకు రావడం లేదు. పైగా పార్టీ కార్యక్రమాలు కూడా ఊపు పెంచడం లేదు. అయితే.. తాడేపల్లిలో కూర్చోవడం.. లేకపోతే.. సుదీర్ఘ పోస్టులు పెట్టి చేతులు దులుపుకోవడం వరకే జగన్ పరిమితం అవుతున్నారు.
ఎన్నికల ఫలితాలువ చ్చేసి ఏడాదిన్నర అయినా.. వైసీపీ తరపున ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్ని కూ డా చేయలేదు. రైతులను పరామర్శించే కార్యక్రమాలను కూడా జాతరలా నిర్వహించడం వివాదానికి దారి తీసింది. ఇక, రాజకీయంగా కూడా దూకుడు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం బలమైన వాయిస్‌తో విరుచుకుపడుతుంటే.. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దగా స్పందించడం కూడా లేదు. ఏదైనా జరిగితే.. వెంటనే స్పందిస్తున్న కూటమి ముందు వైసీపీ తేలిపోతోంది.
అలా కాకుండా.. నిరంతరం ప్రజల మధ్యకు వచ్చేలా వైసీపీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా జగన్.. ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు విపక్షంలో ఉండగా.. ప్రజల మధ్యకు ఎలా వచ్చారో.. ఇప్పుడు జగన్ కూడా అలానే రావాలని వైసీపీ కార్యకర్తలు,, నాయకులు కూడా కోరుతున్నారు. కానీ… జగన్ మాత్రం అయితే.. తాడేపల్లి, లేకపోతే బెంగళూరుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. దీంతో యాక్టివిటీ లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది. ఇదే కొనసాగితే..ఆ యనను మరిచిపోవడం పెద్ద దూరంలో లేదన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
సోషల్ మీడియాలో డిస్కషన్ చూస్తే కాదేదీ అనర్హం అన్న ముతక సామెత గుర్తుకు వస్తుంది. అంతే కాదు ఆలూ లేదు చూలూ లేదు అన్న మరో సామెత కూడా తప్పక తలచుకోవాల్సిందే. సోషల్ మీడియాలో కొన్ని చర్చలు ఎలా వస్తాయో లేక వాటి వెనక వాస్తవాలు ఏమిటో ఊహాగానాలు ఏమిటో తెలియదు కానీ భలేగా చర్చలు మొదలవుతూంటాయి. అలాంటి చర్చే ఇపుడు మరొకటి జగన్ విషయంలో జరుగుతోంది. జగన్ వైసీపీకి సర్వ సత్తాక అధ్యక్షుడు. ఆయన గట్టిగా చూస్తే యాభై మూడేళ్ళ వయసులో ఉన్నారు. రాజకీయంగా ఇది చిన్న వయసుగానే చూస్తారు
అందువల్ల జగన్ రాజకీయ వారసత్వం అన్న మాటకు ఇప్పటికైతే అర్ధం లేదనే అనుకోవాలి. కానీ సోషల్ మీడియాలో చూస్తే అవన్నీ కలిపి మరీ కూడి కొత్త రాజకీయ లెక్కలతో చర్చకు పెడుతున్నారు జగన్ లిక్కర్ స్కాం లో అరెస్టు అవుతారని ఆయనతో పాటు సతీమణి కూడా ఇబ్బందులు పడతారని అపుడు వైసీపీని నడిపించేందుకు ఆయన పెద్ద కుమార్తె రంగంలోకి దిగుతారని అంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజాలు కంటే ఊహాగానాలే ఎక్కువ అన్నది అందరికీ తెలిసిసినా ఈ డిస్కషన్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు అని అంటున్నారు.
అయితే రాజకీయాల్లో చూసినపుడు ఏది అయినా సాధ్యం కాదు అని అనుకోవడానికి అయితే లేదు. కాస్తా ముందూ వెనకా తప్ప అని అంటారు. అలా చూస్తే భారతదేశ రాజకీయాల్లో చాలా మంది తమ సొంత వారిని రాజకీయాల్లో దింపడమూ చూశారు. ఇక జగన్ కూడా తండ్రి వారసత్వాన్ని తీసుకునే ముందుకు వచ్చారు. ఇపుడు ఆయనకు ఇద్దరూ కుమార్తెలు కాట్టి వారు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అన్నదే చర్చ. జగన్ అరెస్టు అయితే పార్టీని నడిపేందుకు ఒక సారధిగా కుమార్తె వస్తారు అని రాజకీయ జోస్యాలు చెబుతున్నారు.
అయితే లిక్కర్ స్కాం లో జగన్ అరెస్టు అవడం ఎంతవరకూ అన్నది ఒక చర్చ. ఇక ఆయన సతీమణి కూడా ఇబ్బందులో పడతారు అన్నది కూడా ఒక ఊహా జనితమైన విషయమే. అని అంటున్నారు ఒక వేళ జగన్ అరెస్టు అయినా రెండు మూడు నెలలు ఉన్నా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పార్టీ ఇపుడు గ్రౌండ్ లెవెల్ దాకా విస్తరించి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్ల వేరే వారు సారధ్యం వహించడం అన్నది అవసరం లేదని అంటున్నారు. ఒకవేళ జగన్ ని అరెస్టు చేసి ఎక్కువ కాలం ఉంచినపుడు ఏమైనా పార్టీకి సారధి అవసరం ఉండొచ్చేమో అని అంటున్నారు.
మొత్తం మీద రాజకీయాలు అంటే పూర్వం మాదిరిగా లేవు. వారిని వీరిని కూడా తెచ్చేసి చర్చలు పెడుతున్నారు. అలా ఎక్కడో లండన్ లో ఉంటూ చదువుకుంటున్న జగన్ కుమార్తెలను కూడా లాగేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ పార్టీలకు కూడా తట్టని ఆలోచనలు వ్యూహాలూ సోషల్ మీడియాలో చాలా మందికి తడుతున్నాయని వైరల్ చేయడం కోసమే ఇదంతా అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎవరేమి అనుకున్నా జగన్ వైసీపీ పార్టీ వారసత్వం ఆయన కుమార్తె సారధ్యం ఇవన్నీ కూడా మంచి కాలక్షేపంగానే ఉన్నాయి. ఆసక్తికరమైన రాజకీయ కధనాలుగానూ ఉన్నాయని అంటున్నారు.