వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ లండర్ కి వెళ్తున్నారు. ఆయన ఈసారి భారీ టూర్ కి ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన బెంగళూరు నుని లండన్ కి వెళ్తున్నారు. లండన్ లో తన పెద్ద కుమార్తె వద్దకు జగన్ వెళ్తున్నారు. అక్కడ ఆయన ఈ నెల 23 వరకూ ఉంటారని చెబుతున్నారు. దాంతో ఈసారి టూర్ ఏకంగా 13 రోజులుగా సాగనుంది అని అంటున్నారు.
ఇక జగన్ లండన్ టూర్ వెళ్ళే ముందు విశాఖలో భారీ రోడ్ షో నిర్వహించి ఉత్తరాంధ్రలో వైసీపీ వైపుగా అటెన్షన్ క్రియేట్ అయ్యేట్లుగా చూశారు. చాలా కాలంగా బెంగళూరు టూ తాడేపల్లి గానే జగన్ రాజకీయ వ్యవహారాలు సాగాయి. దాదాపు మూడు నెలల తరువాత ఆయన మళ్ళీ జనంలోకి వచ్చారు. ఈసారి రోడ్డు మార్గం గుండా విశాఖ నుంచి నర్శీపట్నం వెళ్ళారు ఆరేడు గంటల పాటు రోడ్ షో నిర్వహించి క్యాడర్ కి జోష్ కలిగించారు.
ఇదిలా ఉంటే జగన్ లండన్ టూర్ చాలా రోజుల క్రితమే ఖరారు అయింది. ఈ నేపథ్యంలో తన వద్దకు వచ్చే పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేసారు. పార్టీని జనంలో ఉంచాలని మెడికల్ కాలేజీల విషయంలో యాక్టివిటీని పెంచాలని పీపీపీ విధానం మీద పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్లాలని వైసీపీకి మైలేజ్ వచ్చేలాగ చూడాలని సూచించారు. ఇక కీలక మైన నిర్ణయాలు అన్నీ తరువాత ఉంటాయని చెప్పినట్లుగా తెలుస్తోంది యాభై రోజుల ప్రోగ్రాం ని పార్టీకి జగన్ ఇచ్చారు అని అంటున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ మధ్యనే జగన్ ని కలిశారు అని ప్రచారం సాగుతోంది. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే దాని మీద కూడా చర్చించారు అని అంటున్నారు ఈ ఇద్దరు నేతలూ అనారోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉంటూ వచ్చారు వంశీ అయితే జైలు జీవితాన్ని అనుభవించారు. కొడాలి నాని ఆపరేషన్ చేయించుకున్నారు. ఇపుడు ఈ ఇద్దరూ పార్టీలో తాము చురుకుగా పనిచేస్తామని అధినేతకు చెప్పారని అంటున్నారు. దాంతో వారిద్దరికీ కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు అదే విధంగా కొన్ని సంచలన నిర్ణయాలను కూడా జగన్ లండన్ టూర్ తరువాతనే ప్రకటిస్తారు అని అంటున్నారు మొత్తం మీద జగన్ ఈసారి ఫ్యామిలీ ట్రిప్ వేశారు. తిరిగి ఫుల్ గా రీచార్జి అయిన మీదటనే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఇక మీదట తాను పూర్తిగా జనంలో ఉండే విధంగా కూడా ఆయన కార్యక్రమాలను రూపొందించుకున్నారు అని అంటున్నారు.
















