వైసీపీలో సీనియర్లకు కొదవ లేదు. పైగా వారంతా వైఎస్సార్ తో కలసి పనిచేసిన వారు. అందులో చాలా మంది జగన్ ని అనుసరిస్తూ వైసీపీలో కొనసాగుతున్నారు. అలాంటి వారిలో శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఒకరు. వైసీపీలో మిగిలిన నాయకుల తీరు వేరు, బొత్స తీరు వేరు అని అంటారు.
బొత్స ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పనిచేశారు. పైగా ఆయన రాజకీయంగా విశేష అనుభవం కలిగిన వారు, ఉత్తరాంధ్రాలో బలమైన బీసీ నేతగా ఉన్నారు. సీఎం రేసులో కూడా ఆయన పేరు నలిగింది. ఇలా బొత్స అంటే వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీ కంటే కాస్తా ఎక్కువే అన్న భావన ఉంది. అయితే రాజకీయాల్లో సర్దుబాట్లు ముఖ్యం కాబట్టే బొత్స వైసీపీలో కొనసాగుతున్నారు అని అంటారు.
ఇక జగన్ సైతం బొత్సకు ఇవ్వాల్సిన మర్యాదను గౌరవాన్ని ఇస్తున్నారు అన్నది తెలిసిందే. బొత్సను ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించారు. వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఆయన కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. దాంతో పాటు ఉత్తరాంధ్రాలో ఆయన హవా సాగుతోంది. ఈ నేపధ్యంలో బొత్స ఇటీవల కాలంలో మొత్తం వైసీపీ తరఫున బాధ్యత తీసుకుని మాట్లాడుతున్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తునని ఆయన పవర్ ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆయన గట్టిగానే విమర్శిస్తున్నారు. వైసీపీలో కమిటీల నియామకాల విషయంలో కూడా ఆయన దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఒక విధంగా వైసీపీలో పెద్దగా ఆయన ఉంటున్నారు. వైసీపీలో ఈ రోజు చూస్తే సీనియర్లు చాలా మంది తెర వెనక్కి పోతున్నారు. అనేక మంది మీద కేసులు ఉన్నాయి. చాలా మందికి కేసులు పెడతారేమో అన్న భయం ఉంది. దాంతో సైలెంట్ గానే ఉంటున్నారు చిత్రమేంటి అంటే బొత్స మీద ఇప్పటిదాకా ఏ కేసూ లేదు. ఆయన మాత్రం కూటమి మీద దూకుడుగానే విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో అత్యంత సీనియర్ నేతలలో ఒకరుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారి మీద కూడా కేసుల ఉచ్చు బిగుస్తోంది
ఈ క్రమంలో వైసీపీ తరఫున పెద్ద గొంతుకగా బిగ్ సౌండ్ చేసే వారిగా బొత్స ఒక్కరే కనిపిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు నేతల వరస అరెస్టులు ఇక అధినాయకత్వం దాకా కూడా ఈ అరెస్టుల వ్యవహారం రాబోతోంది అని వార్తలు వస్తున్న క్రమంలో బొత్స క్రియాశీలత్వం మీద కొత్త చర్చ సాగుతోంది. బొత్స మీద పెద్ద భారాలు మోపుతారా లేక ఆయనే వాటిని తీసుకుంటారా అన్నదే ఆ చర్చట. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ రాజకీయ సంక్షోభంలోకి వెళ్ళబోతోంది అన్న ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఒకవేళ జగన్ కనుక అరెస్టు అయితే పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళేది ఎవరు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. సీనియర్లతో కమిటీ వేస్తారా లేక బొత్స వంటి వారికే బాధ్యతలు అందుతాయా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి బొత్సన్న రాజకీయ దూకుడు వెనక ఏమి ఉందో ఏమిటో అన్నది.