ఏపీలో చాలా కాలంగా వినిపిస్తోంది ఈ మాట. గట్టిగా చెప్పాలంటే ఈ ప్రచారానికి నాలుగైదు నెలలు కూడా పూర్తి అయ్యాయి. మొదట్లో ఆసక్తి కలిగింది. తరువాత అది కాస్తా తగ్గింది. ఇపుడు వైసీపీ వారు కూడా దాని మీద ఇదివరకు మాదిరిగా తీవ్రంగా ఆలోచిస్తున్నారా అన్నది కూడా చూడాలి. అలాగే జగన్ అయితే జైలుకు వెళ్ళడానికి రెడీగానే ఉన్నారు అన్నది కూడా మరో ప్రచారంగా ఉంది. లిక్కర్ స్కాం పేరుతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి సిట్ విచారణ జరుపుతోంది. అది లోతుగా సాగుతోంది. వరసగా నేతలు అంతా వైసీపీ నుంచి అరెస్టు అవుతున్నారు. ఇక ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ తరువాత మిగిలింది జగనే అన్న చర్చ అయితే మొదలై చాలా రోజులు అయింది.
జగన్ జైలుకు తప్పక వెళ్తారు అని బీజేపీ రాష్ట్ర నేతలు ఒకరి తరువాత ఒకరు భారీ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితులైన పీవీఎన్ మాధవ్ అయితే జగన్ తప్పించుకోవడం వల్ల కాదని అన్నారు ఆయన అరెస్ట్ ఖాయమని స్పష్టం చేశారు దానికి జగన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. మరో వైపు కూటమిలో బీజేపీ మంత్రిగా ఉన్న సత్యకుమార్ యాదవ్ కూడా తాజగా జగన్ అరెస్ట్ ఖాయమని ప్రకటించారు. జగన్ జైలుకు వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అంటున్నారు. లిక్కర్ స్కాం విషయంలో సిట్ దర్యాప్తు నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
మరో వైపు చూస్తే తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రులు అంతా కూడా జగన్ జైలుకు వెళ్తారని చెబుతున్నారు. లిక్కర్ స్కాం బిగ్ బాస్ అని జగన్ పేరే ఉందని అంటున్నారు. ఏపీలో లిక్కర్ స్కాం అంతర్జాతీయంగా అతి పెద్ద కుంభకోణం అంటున్నారు కేవలం ఖజానాకు నష్టం మాత్రమే కాదు ప్రజల ప్రాణాలను సైతం తీసిన అతి పెద్ద స్కాం ఇది అని అంటున్నారు.
ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ జగన్ జైలుకు వెళ్ళాల్సిందే అంటోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ కూడా జగన్ మీద మండిపడ్డారు. జగన్ పాలన చేయలేదని లిక్కర్ స్కాం లోనే ఆయన అయిదేళ్ళూ ఉన్నారని కూడా కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలకు కూడా విలువ ఇచ్చి లిక్కర్ స్కాం లో వసూలు చేసిన మొత్తాలను చనిపోయిన కుటుంబాలకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
వైసీపీ నేతలు అయితే జగన్ చుట్టూ భారీ కుట్రకు తెర తీశారు అని అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత శిల్పా రవి అయితే కూటమి ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ని జైలుకు పంపాలన్నది కూటమి ఆలోచన అని అందుకోసం లేని కేసుని తెచ్చి జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు అని అంటున్నారు. జగన్ తో ఉన్న నాయకులను అరెస్టు చేస్తున్నారు అని జగన్ పర్యటనల పట్ల ఆంక్షలు విధిస్తున్నారని ఇదంతా ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరు పట్ల ప్రజలలో అసహనం ఉందని తెలిసే ఇలా చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు
జగన్ త్వరలో అరెస్టు అన్న ప్రకటనలు అయితే చాలా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ జగన్ అరెస్టు ఎపుడు అన్నదే అందరిలో చర్చగా ఉంది మే నుంచి ఆగస్టు మొదటి వారానికి వచ్చేసినా జగన్ అరెస్టు మీదనే చర్చ సాగడం విశేషం. అయితే సిట్ సరైన ఆధారాలు అన్నీ పకడ్బందీగా సమకూరుతోందని ఒకసారి అరెస్టు అయితే జగన్ చాలా కాలం జైలులో ఉండేలా గట్టి ఆధారాలతోనే కేసు పెట్టాలి కాబట్టే ఈ విధంగా కొంత జాప్యం అవుతోంది తప్ప ఆయన అరెస్టు పక్కా అని మరో వైపు నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా అరువు రేపు అన్న మాట మాదిరిగా త్వరలో జగన్ అరెస్టు అన్నది ఏపీ రాజకీయాల్లో ఇపుడు ఒక ప్రకటనగా మారిపోయింది అని అంటున్న్నారు.