మాట్లాడితే చాలు అందరూ వివిధ రాష్ట్రాలలో అప్పుల మీదనే చర్చలు పెడతారు. ఫలానా రాష్ట్రం అప్పుల పాలు అయిందని అంటారు. బీజేపీ నాయకులు అయితే నాలుగు ఆకులు ఎక్కువ చదివి మరీ ఈ అప్పులను పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ వచ్చారు ఏపీ కానీ తెలంగాణా కానీ అప్పులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయని బీజేపీ నాయకులు పలు సందర్భాలలో విమర్శలు చేసిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కానీ బీజేపీ నాయకత్వం వహిస్తూ పదకొండేళ్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీయే చేసిన అప్పు ల చిట్టా చూస్తే భారత పౌరులు వామ్మో అనుకోవాల్సిందే అంటున్నారు.
దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించామని బీజేపీ పెద్దలు పదే పదే చెబుతూ ఉంటారు రోడ్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ అంటారు. అలాగే తాగు నీరుతో పాటు వైద్య సదుపాయాలకు ఖర్చు చేస్తున్నామని చెబుతారు. అవన్నీ సరే అనుకున్నా ఈ అభివృద్ధి మాటున భారీగా పెరిగిపోతున్న అప్పుల మాటేమిటి అన్నదే అందరికీ పెద్ద ప్రశ్నగా ఉంది.
భారత్ దేశం అప్పులు ఈ రోజుకు అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయల దాకా ఉందని అంటున్నారు. ఇది ఏ మాత్రం చిన్న సైజు కాదు భారీ సైజు, వేయి ఏనుగుల సైజు. పెద్ద దేశం కదా పెద్దగా అప్పులు ఉండవా అన్నా కూడా ఇవి ఎక్కడా ఉన్న అభివృద్ధికి అప్పులకు మధ్య పొంతన కుదర్చడం లేదు అని అంటున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పు చూస్తే కనుక ఇది జాతీయ స్థూల ఉత్పత్తిలో ఏకంగా 56 శాతానికి పై మాటగానే ఉంది అని అంటున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులకు వడ్డీలు పెను భారంగా మారుతున్నాయి. ఈ వడ్డీలను తీర్చేందుకే ఎక్కడ లేని ఆదాయం తెచ్చి పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాలలో ఆదాయం వస్తుంది. అలా వచ్చిన ఆదాయంలో ఏకంగా 37 శాతానికి పైగా ఈ వందల లక్షల కోట్ల రూపాయల అప్పులకే వడ్డీలు కట్టెందుకు సరిపోతుంది అని అంటున్నారు. ఇవన్నీ కేంద్రం పార్లమెంట్ ముందు పెట్టిన వివరాలుగా ఉండడంతోనే అంతా షాక్ తింటున్నారు. ఇన్ని వందల కోట్ల అప్పులు దేశానికి ఎలా వచ్చాయని కూడా ఆరా తీస్తున్నారు.
ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 2014లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రధానిగా ఉండగా 2015 -16 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం అప్పులు 70.88 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయిత గత పదేళ్ళ కాలంలో చూస్తే కనుక ఈ అప్పులు మూడు రెట్లు పెరిగాయని అంటున్నాఉర్. అంటే ఒక్కసారిగా 19 శాతం మేర అప్పులు పెరిగాయని అంటున్నారు.
ఇక మోడీ ప్రధానిగా ఉండగానే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా వంద లక్షల కోట్ల రూపాయలను కేవలం అప్పులకు వడ్డీలుగా చెల్లించింది. అంటే ఏటా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలుగానే పోయింది అన్న మాట. కేంద్రం ఈ తీరున అప్పులు చేస్తూంటే రాష్ట్రాలు కూడా అప్పులు తోచిన తీరున చేస్తున్నాయి. అలా అప్పులలో తమిళనాడు 9.55 లక్షల కోట్లతో ఫస్ట్ ర్యాంక్ కొట్టింది. ఆ తరువాత యూపీ 8.57 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంటే మహారాష్ట్ర 8.12 లక్షల కోట్లతో టాప్ త్రీగా నిలిచ్నింది అని లెక్కలు చెబుతున్నాయి.
మోడీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక నియంత్రణ గాడి తప్పింది అన్నది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణగా ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలను కేవలం పదేళ్ళ కాలంలో చేయడం అంటే దారుణం అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆదాయం అప్పులు రెండూ తమ హయాంలో బ్యాలెన్స్ చేశామని బీజేపీ మాత్రం అలవి కాని తీరున అప్పులు చేసి రుణ భారతాన్ని ఆవిష్కరించింది అని విమర్శిస్తోంది. కాంగ్రెస్ అన్నాదని కాదు కానీ దేశానికి 200 లక్షల కోట్ల అప్పులు ఏమిటి అందులో వంద లక్షల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లించడం ఏమిటి ఇదే ఆర్ధిక నిపుణులతో పాటు అందరిలో చర్చగా ఉంది.