ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

India: కేంద్రం సంచలన నిర్ణయం

India: కేంద్రం సంచలన నిర్ణయం
ADVERTISEMENT

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడులతో టెహ్రాన్‌, ఇతర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. శబ్దాలు, పేలుళ్ల మధ్య కాలం గడుపుతూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నామని భారతీయులు చెబుతున్నారు.ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఉన్నారు. అక్కడి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ భారతీయులను స్వదేశానికి తరలించే ప్రత్యేక ఆపరేషన్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలో పేరును ఖరారు చేయనున్నారు. అయితే గగనతల ప్రయాణంపై పరిమితులు ఉన్న నేపథ్యంలో భూసరిహద్దుల మీదుగా తరలించే అవకాశాలు ఉన్నట్టు ఇరాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

ఇరాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఇంతిసాల్‌ మొహిదీన్‌ మాట్లాడుతూ “విమాన దాడుల శబ్దాలతో నిద్ర మానేశాం. రోజూ పేలుడు శబ్దాల మధ్య గడుపుతున్నాం. కాలేజీ బేస్‌మెంట్‌లో కాలం తీయాల్సి వస్తోంది. టెహ్రాన్‌లోని మా యూనివర్శిటీలో దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. మనం ఎప్పుడు స్వదేశానికి వెళ్లగలమో అనిపిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. టెహ్రాన్‌లోని భారత ఎంబసీ నిరంతరం పరిస్థితిని గమనిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొంది. మిగిలినవారి కోసం కూడా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.భారతీయులంతా సురక్షితంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యత్నాలు చేస్తుండటం కొంత భరోసానిస్తుండగా, అక్కడి భారతీయులు త్వరితగతిన తాము స్వదేశానికి చేరాలన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఓవైపు అమెరికాతో ఇరాన్ కు అణు చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆదివారం (జూన్ 15)న ఆరో విడత చర్చలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఈ చర్చలపై ఒక క్లారిటీ రావొచ్చనే ప్రచారమూ జరుగుతోంది. ఈ సమయంలో గురువారం రాత్రి (జూన్ 12)న ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇరాన్ పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో టెహ్రాన్ లోని ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్ట్ పైనా ఇరాన్ కు చెందిన మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ పైనా మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే.. ఓ వైపు అమెరికాతో ఇదే అణ్వాయుధాలపై చర్చలు జరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్ సడన్ గా ఈ రేంజ్ లో ఎందుకు ఇరాన్ పై విరుచుకుపడింది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. తాజాగా దానికి సమాధానం వచ్చేసింది. Also Read – 50 లక్షలు = 10 లక్షల జీతమా? బెంగళూరు ఐటీ జీతాలపై హాట్ టాపిక్ అవును… అమెరికాతో అణు చర్చలు జరుగుతున్న వేళ ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడటానికి గల కారణం తెలిసింది. అందుకు గల కారణం.. ఇరాన్ న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన డిజైన్ ప్రాసెస్ కు సంబంధించి అత్యంత కీలక ప్రయోగం చేసిందనే గోల్డెన్ ఇన్ఫర్మేషన్.. టెల్ అవీవ్ కు అందిందంట. దీంతో.. టెహ్రాన్ తలచుకుంటే కొన్ని వారాల్లోనే అణుబాంబులను రూపొందించగలదని ఇజ్రాయెల్ ఓ నిర్ధారణకు వచ్చిందంట. ఇదే సమయంలో… ఆయుధ శ్రేణి యురేనియం నుంచి ఓ పేలుడు పరికరాన్ని తయారుచేసేందుకు పలు వర్కింగ్‌ గ్రూప్‌ లను ఇరాన్‌ ఏర్పాటుచేసిందని సమాచారం అందిందంట! దీంతో.. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా తమ అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతుందని గ్రహించిన ఇజ్రాయెల్… మరో ఆలోచన లేకుండా ఇరాన్ లోని అణు స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడిందని “టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్” కథనంలో పేర్కొంది.

దీనికి తోడు పౌర అవసరాలకు మించి యురేనియంను ఇరాన్‌ శుద్ధి చేస్తూనే ఉందట. ఇదే సమయంలో.. అటామిక్‌ ఎనర్జీ సంస్థ గత నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఇరాన్‌ వద్ద ఉన్న యురేనియం మరింత శుద్ధి చేస్తే 9 అణుబాంబుల తయారీకి సరిపోతుందని పేర్కొంది. దీంతో.. ఇజ్రాయెల్‌ తన తొలిదాడిలోనే అనుభవజ్ఞులైన సుమారు ఆరుగురు ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలను అంతం చేసింది. దీనికి అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్ కోవర్టు బలగాలు ట్రక్కులు, కంటైనర్లు, సూట్ కేసుల్లో ఇరాన్ లోకి చేర్చారట. అనంతరం.. వీటిని ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొస్సాద్ ఏజెంట్లు సమీకరించి.. అవసరమైన బలగాలకు చేర్చాయి. దీంతో.. గురువరం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ శ్రేణులు ఇరాన్ పై దాడులు చేశాయి. ఇవి ప్రధానంగా ఇరాన్ అణుశాస్త్రవేత్తలు, ఇరాన్ టాప్ మిలటరీ జనరల్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. వాస్తవానికి ఎలాంటి యుద్ధ సంకేతాలు వీరికి వచ్చినా వీరంతా.. దాడులను తట్టుకునే షెల్టర్స్ లోనే నివాసం ఉండేవారు. అయితే.. ఓ పక్క అమెరికాతో తమకు అణు చర్చలు జరుగుతున్నందు వల్ల ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం లేదని వీరంతా భావించారంట. దీంతో… వీరంతా ప్రైవేట్ హౌసెస్ లో బస చేశారు. ఆ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్.. వారు నివాసమున్న అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ పై నేరుగా దాడి చేశాయి.

ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఏ లక్ష్యంతో అయితే యుద్ధం ప్రారంభించిందో.. ఇజ్రాయెల్ ఆ పని దాదాపు పూర్తి చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఇరాన్లోని అణు స్థావరాలతో పాటు అణు శాస్త్రవేత్తలను మట్టుబెట్టింది.ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్).. ఇరాన్‌ వ్యాప్తంగా సుమారు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో.. వాషింగ్టన్‌ కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ స్పందిస్తు… ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో 406 మంది ఇరాన్‌ పౌరులు మృతి చెందారని, 654 మందికిపైగా గాయాలపాలయ్యారని పేర్కొంది.

ప్రధానంగా… ఇరాన్‌ ఆర్థిక మూలాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. చమురు, సహజ వాయు క్షేత్రాలపైనే గురిపెట్టింది. ఈ క్రమంలో.. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు క్షేత్రమైన ‘సౌత్‌ పార్స్‌’ పైనా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో.. ఇరాన్ కు మరింత కష్టాలు తెచ్చే ఓ బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ కు బలం పెరుగుతోంది! అవును… ఇప్పటికే టెహ్రాన్ పై టెల్ అవీవ్ నిప్పుల వర్షం కురిపిస్తోన్న వేళ ఇరాన్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్ ను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో.. ఇప్పటికే పశ్చిమాసియాలో మొహరించి ఉన్న అమెరికా యుద్ధ నౌకల నుంచి ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు చురుగ్గా పనిచేస్తూ.. ఇరాన్ క్షిపణులను పేల్చేస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా… యుఎస్ యుద్ధనౌకల్లో ఆర్లీ బర్క్-క్లాస్ డిస్ట్రాయర్లు.. ఇజ్రాయెల్‌ కు దగ్గరగా, మధ్యధరా సముద్రంలో మోహరించాయి. ఈ నౌకలు ఎస్ఎం-3 వంటి అధునాతన క్షిపణులను కలిగి ఉంటాయి. ఇవి సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు. వాస్తవానికి ఈ విషయాన్ని ఇరాన్ మొదట నుంచీ ఆరోపిస్తుంది. అయితే.. తాజాగా వాటికి సంబంధించిన సాక్ష్యాలు తెరపైకి వచ్చాయి! ఇలా డిఫెన్స్ విషయంలో ఇజ్రాయెల్ కు అమెరికా సహకరిస్తుండగా.. ఎఫెన్స్ విషయంలో సిరియా సహకరిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా… ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగిన సిరియా.. ఇరాన్ కు వ్యతిరేకంగా దాడులకు ప్లాన్ చేస్తోందట. దీంతో.. ఇప్పుడు ఇజ్రాయెల్ జెట్ ఫైటర్లు సిరియా మీదుగానే ఇరాన్ ను టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు.

Tags: #EmergencyEvacuation#Geopolitics#GlobalCrisis#IDFStrikes#IndiaInIran#IndianEmbassy#IndianEvacuation#IndianGovernment#IndiansAbroad#InternationalNews#IranCrisis#IranIsraelTensions#IsraelIranWar#MEAIndia#MiddleEastConflict#NuclearTensions#SouthParsStrike#StudentsInIran#TehranUnderAttack#USWarships#WestAsiaWar
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Karnataka: వ్యాపారవేత్త ఇంట్లో కోటి రూపాయిలను కొట్టేసిన పనిమనిషి !

Next Post

Kavitha: అసంతృప్తి ముగిసినట్టేనా?

Related Posts

PoojaHegde
Entertainment

PoojaHegde:ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న పూజా హెగ్డే ఎరుపు అవతారం

Keralam
Big Story

Keralam:కేరళ నుంచి ‘‘కేరళం’గా మార్పు: కేంద్ర కేబినెట్ ఆమోదం, స్థానిక భాషా మూలాలకు గౌరవం

GHMC
Big Story

GHMC:హైదరాబాద్‌లో దోమల పెరుగుదలకు జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్కాం కారణమా? డీజిల్ దుర్వినియోగం బహిర్గతం

YouTuber
Crime

YouTuber:హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం

TirumalaLaddu
Andhra Pradesh

TirumalaLaddu:శాసనసభలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

AliaBhatt
Entertainment

AliaBhatt:BAFTAs వేదికపై అలియా భట్ అద్భుత ఎలిగెన్స్ – అంతర్జాతీయంగా మెరిసిన భారత గర్వం

Next Post
Kavitha: అసంతృప్తి ముగిసినట్టేనా?

Kavitha: అసంతృప్తి ముగిసినట్టేనా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PoojaHegde

PoojaHegde:ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న పూజా హెగ్డే ఎరుపు అవతారం

Keralam

Keralam:కేరళ నుంచి ‘‘కేరళం’గా మార్పు: కేంద్ర కేబినెట్ ఆమోదం, స్థానిక భాషా మూలాలకు గౌరవం

GHMC

GHMC:హైదరాబాద్‌లో దోమల పెరుగుదలకు జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్కాం కారణమా? డీజిల్ దుర్వినియోగం బహిర్గతం

YouTuber

YouTuber:హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం

Recent News

PoojaHegde

PoojaHegde:ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న పూజా హెగ్డే ఎరుపు అవతారం

Keralam

Keralam:కేరళ నుంచి ‘‘కేరళం’గా మార్పు: కేంద్ర కేబినెట్ ఆమోదం, స్థానిక భాషా మూలాలకు గౌరవం

GHMC

GHMC:హైదరాబాద్‌లో దోమల పెరుగుదలకు జీహెచ్ఎంసీ ఫాగింగ్ స్కాం కారణమా? డీజిల్ దుర్వినియోగం బహిర్గతం

YouTuber

YouTuber:హైదరాబాద్‌లో యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info