తనపై జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఐబొమ్మ రవి తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆయన, తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు.మీడియాతో మాట్లాడుతూ, తన పేరును కావాలనే వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారని, ఆధారాలు లేకుండా తనను టార్గెట్ చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐబొమ్మతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఆరోపణల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశారు.
ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే ఇలాంటి అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని మీడియా ద్వారా కోరారు. సోషల్ మీడియా ట్రయల్స్ కాదని, చట్టపరంగా కోర్టులోనే నిజం తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, నిజం చివరికి బయటకు వస్తుందని ఐబొమ్మ రవి అన్నారు.మొట్టమొదటిసారి మీడియాతో మాట్లాడిన ఐబొమ్మ రవి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
నా పేరు #iBommaRavi నా? లేక రవినా? ముందుగా అదే క్లారిటీ ఇవ్వండి. సోషల్ మీడియాలో కావాలనే పేర్లు మార్చి, నన్ను వేరే వ్యక్తిలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
నాకు #iBomma తో ఎలాంటి సంబంధం ఉందని మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి. అలాగే నేను బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని చెబుతున్నారే గానీ, దానికి సంబంధించిన ప్రూఫ్‌లు మీ దగ్గర ఉన్నాయా? ఒక్క ఆధారం అయినా చూపించగలరా?పోలీసులు ఏదైనా చెప్పారంటే అదే నిజం అయిపోతుందా? ఆరోపణలు చేయడమే న్యాయమా? చట్టపరమైన ఆధారాలు లేకుండా, ఒక వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేయడం ఎంతవరకు సరైనది?
నాపై ఏమైనా నిజమైన ఆధారాలు ఉంటే కోర్టులో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సోషల్ మీడియా ట్రయల్స్ కాదు, చట్టమే నాకు న్యాయం చేస్తుంది. అబద్ధపు ఆరోపణలతో నన్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తే వెనక్కి తగ్గను.
నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది.
చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది.”
– రవి
iBommaRavi











