కోకాపేటలో ఎకరం రూ. 137 కోట్లకు కొనుగోలు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వజ్ర, ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థలు రెండు కలిపి దాదాపుగా పది ఎకరాలను రూ. 1300 కోట్లకు పెట్టి కొనుగోలు చేశాయి. ఇది రియల్ ఎస్టేట్ బూమ్ అని చాలా మంది మాట్లాడటం ప్రారంభించారు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే అది బూమ్ కాదు.. బూమ్‌ను బద్దలు చేసే విపరీత పరిణామం.
హైదరాబాద్(hyderabad) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు సామాన్యులకు అందని విధంగా మారింది. ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ 70 లక్షలకు కూడా లభించడం లేదు. ఏ సౌకర్యాలు లేకుండా నిర్మించే చిన్న చిన్న అపార్టుమెంట్లలోనే ఈ ధరలకు లభించడం లేదు. ఇక కాస్త సౌకర్యాలు కల్పించే అపార్టుమెంట్లకు అయితే కనీసం రూ. కోటి తప్పడం లేదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఎకరాలను వందల కోట్లలో కొని.. అందులో ఆకాశానికి తాకేలా అంతస్తులతో నిర్మించి .. కనీసం రెండున్నర కోట్లకు అమ్ముకుంటున్నారు. కానీ కొనేవాళ్లు ఎంత మంది?
ఇప్పుడు కోకాపేటలో 130 కోట్లు అని.. ఇతర ప్రాంతాల్లో కనీసం వంద కోట్లు ఉండదా అని రేట్లు పెంచేశారు. అఫోర్డబుల్ హౌసింగ్ ట్రెండ్ తగ్గిపోవడానికి ఈ భూమి ధరలే కారణం అని బిల్జర్లు అంటున్నారు. ఇలా ప్రభుత్వమే పోటాపోటీగా వేలం వేసి పరుల పెంచేస్తే.. మధ్యతరగతి జీవులు అసలు సొంత ఇల్లు కట్టుగోలరా అన్నది ఎవరూ ఊహించడం లేదు. వారికి పెరుగుతున్న జీతాలకు.. పెరుగుతున్న ఇంటిధరలకు పొంతన ఉండటం లేదు. ఇలాంటి ల్యాండ్ వేలాల వల్ల.. సామాన్యులు ఇల్లు (house)కొనాలనుకునే కల.. దూరంగా జరిగిపోతోంది. ఇది రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్‌కూ పెద్ద సమస్యగా మారుతుంది.

















