టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో జులై 24న థియేటర్స్ లోకి రానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించిన ఆ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయనున్నారు.
అయితే ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మేకర్స్ వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పవన్ హాజరై మాట్లాడారు. సినిమా సహా పలు విషయాలపై మాట్లాడి సందడి చేశారు.
ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరికొన్ని గంటల్లో ఏం మాట్లాడుతారోనని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయానికి వస్తే దూకుడుగా ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ గా ఉంటారు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు విషయంలో యాక్టివ్ గా ఉంటున్నారు. పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఆయనే తెలిపారు. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. వీరమల్లుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పవన్.. మూడు రోజుల్లో రెండు సార్లు సినిమాను వీక్షించారు! పవన్ మూడు రోజుల క్రితం సినిమా మొత్తాన్ని చూశారు. ఇప్పుడు రీసెంట్ గా మాటల మాంత్రికుడు, తన ప్రియమైన స్నేహితుడు త్రివిక్రమ్ తో అన్నపూర్ణ స్టూడియోస్ లో కలిసి మళ్లీ చూశారట.
విడుదలకు ముందు పవన్ తన సొంత సినిమాను అత్యధిక సార్లు చూడటం ఇదే అని తెలుస్తోంది. తద్వారా ప్రాజెక్ట్ లో ఆయన ఎంతగా నిమగ్నమై ఉన్నారో, భావోద్వేగపరంగా కనెక్ట్ అయ్యారో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే , పవన్ కళ్యాణ్ అవుట్ పుట్‌తో చాలా సంతోషంగా ఉన్నారని, సినిమా స్క్రీనింగ్ తర్వాత తన సంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. సినిమా చూసిన తర్వాత పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారని, ఎక్కువగా టీమ్ కృషికి ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. పవన్ సానుకూల స్పందన నటీనటులు, సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాలి. కచ్చితంగా సినిమా అలరిస్తుందనే నమ్మకం పెరిగిందట. మరి మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు ఎలా ఉంటుందో వేచి చూడాలి.