హీరో మోటోకార్ప్ తాజాగా మార్కెట్‌లోకి మరో కొత్త మోడల్‌ను దింపింది. అదే హచ్‌ఎఫ్ డీలక్స్ ప్రో (Hf Deluxe Pro). ఇది సాధారణ బైక్‌లా కాకుండా, ఇది మరింత ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోడల్ ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్‌ను పూర్తిగా ఊపేస్తుందనేలా కనిపిస్తోంది. ఈ బైక్‌ను నమ్మకాన్ని, స్టైల్‌ను, విలువను ప్రాధాన్యతగా పెట్టుకునే భారతీయ వినియోగదారుల దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. HF డీలక్స్ ప్రోను చూస్తే, అది ఒక బోల్డ్, స్టైలిష్ అప్దేట్‌ను అందించినట్లు తెలుస్తుంది. హీరో మోటోకార్ప్ పేరు చెబితేనే గుర్తొచ్చే విశ్వసనీయతను కొనసాగిస్తూ, ఈ మోడల్‌కి అదనంగా మరిన్ని కొత్త అంశాల జోడించారు. దీని డిజైన్ ప్రతి వయస్సు వారినీ ఆకట్టుకునేలా ఉంది. చూడటానికి సింపుల్‌గా ఉండేలా ఉన్నప్పటికీ, మోడరన్ టచ్‌ను మర్చిపోలేదు.
హీరో మోటోకార్ప్ కొత్త HF డీలక్స్ ప్రో, బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త శకం ప్రారంభించినట్టే. దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లలో రూ. 73,550(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్న ఈ బైక్, దాని ధరకు మించి ఫీచర్లను అందిస్తోంది. ఈ మోడల్‌లో కొత్తగా డిజైన్ చేసిన బాడీ గ్రాఫిక్స్, కిరీటం ఆకారంలోని హై-ఇంటెన్సిటీ పొజిషన్ లైట్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్, ఈ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది.
ఇది బైక్‌కి కేవలం స్టైలిష్ లుక్‌నే కాదు, రాత్రిపూట రైడింగ్‌లో మెరుగైన విజిబిలిటీని కూడా ఇస్తుంది. అంతేకాదు, బైక్‌లో వేసిన క్రోమ్ యాక్సెంట్‌లు కూడా ప్రీమియం అనుభూతిని కలిగించేలా డిజైన్ చేయబడ్డాయి. ఈ బైక్‌లోని 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8000 RPM వద్ద 7.9 bhp పవర్, 6000 RPM వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రోజువారి పనితీరులో దృఢంగా ఉంటుంది.
ఈసారి హీరో మోటోకార్ప్, HF డీలక్స్ ప్రో మోడల్‌లో కొన్ని సాంకేతిక అంశాలను ఇచ్చింది. ఈ బైక్‌లో i3S (Idle Stop-Start System) అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం విశేషం. ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆపివేయడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. మళ్లీ యాక్సిలేటర్‌ను తాకగానే ఇంజిన్ తిరిగి ఆన్ అవుతుంది. ఇది 83 కిమీల మైలేజ్ ఇవ్వవచ్చు. మెట్రో నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా మారుతుంది.
ఇంకా, తక్కువ ఘర్షణ ఇంజిన్ ద్వారా పవర్ వృథా కాకుండా, మైలేజీ మరింత మెరుగవుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన టైర్లు గ్రిప్, స్టెబిలిటీ విషయంలో మరింత నమ్మకాన్ని ఇస్తాయి. వీటితో పాటు, HF డీలక్స్ ప్రోలోని అధునాతన డిజిటల్ స్పీడోమీటర్ దీన్ని మరింత ఆధునికంగా మార్చింది. ఇది స్పష్టతతో రియల్ టైమ్ రైడింగ్ డేటాను చూపిస్తూ, ఒక ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. Low Fuel Indicator(LFI) సౌలభ్యం కూడా అందులో భాగమే.
ఇది ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు ముందుగానే హెచ్చరిస్తుంది, తద్వారా రైడర్లు ఆందోళన లేకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. హీరో HF డీలక్స్ ప్రో లేటెస్ట్ వెర్షన్ యువతరాన్ని ఆకట్టుకునేలా డిజైన్ పరంగా మంచి అప్‌డేట్‌ను పొందింది. ముఖ్యంగా కలర్ ఆప్షన్ల విషయంలో కంపెనీ ఈసారి బోలెడంత స్టైల్‌ను జోడించింది. ఈ బైక్ ఇప్పుడు నాలుగు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఇది ఎరుపు-నలుపు, పసుపు-నలుపు, వెండి-నలుపు, నీలం-నలుపు కలయికలతో వస్తుంది. ఈ కాంబినేషన్లు ప్రత్యేకంగా స్పోర్టీ లుక్ కోరుకునే యంగ్ కస్టమర్లకు దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. అల్లాయ్ వీల్స్, ఇంజిన్, గ్రాబ్ రైల్ వంటి భాగాల్లో నలుపు రంగు డామినేట్ చేయడం, బైక్‌కు మరింత క్లీన్, స్పోర్టీ టచ్‌ను ఇస్తోంది. దీనివల్ల బైక్ ఒక హై-కాంట్రాస్ట్ థీమ్‌ను కలిగి ఉండి, చూసే వారికి డైనమిక్ ఫీలింగ్ కలిగిస్తోంది.