పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. పాన్ ఇండియా రేంజ్‌లో జూలై 24న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ నుంచి ప్రమోషన్ల వరకూ హై లెవల్ లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి హైప్‌ను మరింత పెంచారు.
ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా హరిహర వీరమల్లు చిత్రబృందానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఇది చిత్ర యూనిట్‌కే కాదు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా శుభవార్తగా మారింది. సాధారణంగా టికెట్ ధరల పెంపు అనేది ప్రత్యేక దృష్టిని ఆకర్షించే అంశం. ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే ఆ అవకాశం లభించడం విశేషం.
ఈ నెల 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోల నిర్వహణ కోసం ఒక్కో టికెట్ ధరను రూ.600 వరకు నిర్ణయించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. దీనితో ప్రీమియర్ షోల కోసం భారీగా టికెట్ల డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక సినిమా విడుదలైన జూలై 24 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని అధికారికంగా అనుమతి లభించింది. ఇలాంటి టికెట్ ధరల పెంపుతో సినిమా మొదటి వారం కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకు టాక్ ఎలా ఉన్నా అభిమానుల మద్దతు ఎప్పుడూ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఈసారి ప్రమోషన్లలో కూడా పవన్ పాల్గొనడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం సినిమా పట్ల ఆయన పెట్టుకున్న కృషిని తెలియజేస్తోంది. అందుకే టికెట్ పెంపుతోపాటు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకుడిగా ఉన్నా, తర్వాత జ్యోతికృష్ణ బాధ్యతలు చేపట్టారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ఏఎం రత్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పుడు సర్కార్ ఇచ్చిన టికెట్ రేట్ల పెంపుతో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లకు రంగం సిద్ధమైంది. ఇక ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
ఈ వారం టాలీవుడ్‌లో అందరి దృష్టి ఒక్క సినిమాపైనే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి సినిమా చేయడం, మరోవైపు క్రిష్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై హైప్ కొనసాగుతోంది.
ఈ సినిమాను ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. స్టార్ క్యాస్టింగ్, పాన్ ఇండియా టెక్నికల్ టీం, గ్రాండ్ సెట్‌లతో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్‌తో మంచి పాజిటివ్ బజ్‌ను సంపాదించుకుంది. ట్రైలర్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇటీవల హైదరాబాదులో జరిగిన ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లతో హైప్ మరింత పెరిగింది. ఇప్పుడీ సినిమా నైజాం రైట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు చిత్రాన్ని నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయబోతుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం, ఈ హక్కులను వారు దక్కించుకోవడానికి రూ.35 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇది పవన్ కెరీర్‌లోనే అత్యధికంగా చెప్పుకోవచ్చు.
మైత్రీ సంస్థ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రీమియర్లతో పాటు, నైజాంలోని కీలక థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్‌లు, భారీ మల్టిప్లెక్స్ రిలీజ్‌లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా మొదటి రోజు నుంచే భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ సినిమా ఆకట్టుకునే విధంగా రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎమ్.ఎం.కీరవాణి సంగీతం ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తంగా చూస్తే, నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడవడమే కాకుండా, హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మరి కంటెంట్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.